ఇలాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మాజీ.. నటుడిగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా పలు భిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనదైన సత్తా చాటుకుంటున్నాడు. బ్రహ్మాజీ ఏ పాత్రలో అయినా నటించగలడనే న మ్మకాన్ని దర్శక నిర్మాతలకు కలిగించాడు. అందుకే ఆయన ఒక్కో ఒక్కో తరహా పాత్రలో మెప్పిస్తూ వుంటాడు. తాజాగా ఆయన హర్రర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘నెక్స్ట్ నువ్వే’ చిత్రంలో కీలకపాత్ర పోషించాడు. నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో ఆదిసాయికుమార్, వైభవి, రేష్మి ముఖ్యపాత్రల్లో వి4 మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 3న విడుదలవుతున్న సందర్భంగా నటుడు బ్రహ్మాజీ చెప్పిన విశేషాలు..
సరికొత్త పాత్రలో..
నటుడిగా నా ఇనే్నళ్ల కెరీర్‌లో మొదటిసారి ఈ తరహా పాత్రలో నటిస్తున్నాను. అలాగే హర్రర్ సినిమా చేయడం కూడా ప్రథమమే. ఇందులో నా పాత్ర హాస్యాన్ని పంచుతుంది. ఈ సినిమాలో ఆదితో కలిసి నటించడం ఆనందంగా వుంది. నా పాత్ర పేరు శరత్. కథలో కీలకంగా వుంటుంది.
నటుడిగా చాలా పాత్రలు
పరిశ్రమలోకొచ్చి చాలా కాలం అయింది. ఇప్పటివరకూ ఎన్ని సినిమాలు చేశానో లెక్కపెట్టుకోలేదు. కానీ నాకు గుర్తింపునిచ్చిన పాత్రలైతే ఓ 40కిపైగా చేసి ఉంటాను. సింధూరం, గులాబి, చంద్రలేఖ సినిమాల్లో వరుసగా భిన్నమైన పాత్రలు చేయడం నాకు బాగా ఉపయోగపడింది. అందుకే అన్ని రకాల పాత్రలు చేయగలుగుతున్నాను.
హీరో ఆశ లేదు
నిజానికి హీరో అవుతానని అనుకోలేదు. కానీ సింధూరంతో అయ్యాను. ఆ తరువాత చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం నటుడిగా సంతృప్తిగా వుంది. హీరో అంటే చాలా టెన్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. ఒక కొత్త తరహా పాత్రను అనుకుంటే దీన్ని బ్రహ్మాజీ చేయగలడనే పేరు తెచ్చుకున్నాను. కామెడీ, విలన్, సీరియస్.. ఇలా ఏ ఎమోషన్‌ను అయినా పండించగలను అన్న పేరుంది.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం రామ్‌చరణ్ ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్నాను. దాంతోపాటు మహేష్ ‘్భరత్ అనే నేను’, నానితో ‘కృష్ణార్జున యుద్ధం’, అలాగే చందూ మొండేటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాను. అందరు దర్శకులు ఇష్టమే. ఇప్పటివరకూ సురేందర్‌రెడ్డితో మాత్రం చేయలేదు.

శ్రీ