ఫస్ట్‌లుక్ రాదట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 25వ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ వస్తుందని మెగా అభిమానులు తెగ ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆశను నిరాశ చేసేలా పవన్‌కళ్యాణ్ ఈ దీపావళికి ఫస్ట్‌లుక్ సందడి చేయడంలేదని తెలుస్తోంది. దాంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ప్రకటించలేదు. ప్రస్తుతం ‘అజ్ఞాతవాసి’ అనే పేరు అంతటా వినిపిస్తోంది. ఈ టైటిల్ అధికారికంగా పెడతారా లేదా అనే విషయం ఖరారు కాకపోయినప్పటికీ మీడియాలో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే విదేశాల్లో చిత్రీకరణకు యూనిట్ బయలుదేరనుంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికితోడు బిజినెస్ పరంగా కూడా ఎవరూ ఊహించని స్థాయికి జరుగుతోందట. అయితే త్వరలోనే మంచి సమయం చూసుకుని టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.