రుణం’కు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో ప్రతి మనిషి ఎవరికో ఒకరికి రుణపడుతూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకుని తీర్చేవాడు మనిషవుతాడు. అత్యాశ మనిషిని ఎంత దూరం అయినా తీసుకువెళ్తుంది. ఒక్కోసారి అది జీవితాన్ని గొప్ప స్థాయిలో నిలుపుతుంది. ఒక్కోసారి అథఃపాతాళానికి తొక్కుతుంది. అత్యాశవల్ల జరిగే అనర్థాన్ని అత్యంత వినోదాత్మకంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాం ‘రుణం’ చిత్రంతో అంటున్నారు చిత్ర దర్శకులు ఎస్. గుండ్రెడ్డి. బెస్ట్ విన్ ప్రొడక్షన్స్ పతాకంపై భీమనేని సురేష్, జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రుణం’ చిత్రంలో గోపీకృష్ణ, మహేంద్ర హీరోలుగా పరిచయమవుతుండగా, శిల్ప, తేజు, ప్రియాంక హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు జరిపిన అనంతరం ఫిల్మ్ చాంబర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో చిత్ర నిర్మాతలు భీమనేని సురేష్, జి.రామకృష్ణారావు, చిత్ర సమర్పకులు గాలిరెడ్డి, దర్శకుడు ఎస్.గుండ్రెడ్డి, హీరో హీరోయిన్లు, విలన్ ప్రదీప్ ప్రత్తికొండ, సంగీత దర్శకుడు ఎస్.వి.మల్లిక్‌తేజ పాల్గొన్నారు. ఆర్‌ఎఫ్‌సిలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో రుణం షూటింగ్ పూర్తిచేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం ద్వారా హీరోలుగా పరిచయం చేస్తున్న దర్శక నిర్మాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని హీరోలు పేర్కొన్నారు. హిందీలో ఒకటి, కన్నడలో నాలుగు సినిమాలు చేసిన తనను ‘రుణం’ చిత్రంలో తెలుగులో దర్శకుడిగా పరిచయం చేస్తున్న నిర్మాతలకు దర్శకుడు ఎస్.గుండ్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వినోదానికి పెద్ద పీట వేస్తూ మానవ సంబంధాలు, మనస్తత్వాల నేపథ్యంలో రూపొందుతున్న ‘రుణం’ సాధించబోయే విజయంపై తమకు పూర్తిగానమ్మకం ఉందన్నారు. ఎ.వెంకట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: భీమనేని సురేష్, జి.రామకృష్ణారావు, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: ఎస్.గుండ్రెడ్డి.