23న ‘ఆక్సిజన్’ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం ‘ఆక్సిజన్’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సంబంధించిన పాటలను ఈనెల 23న వైభవంగా హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ- ‘‘హై టెక్నికల్ స్టాండర్ వేల్యూస్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో రూపొందిన ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లోనే స్పెషల్ మూవీ అవుతుంది. గోపీచంద్ డెడికేషన్, సపోర్ట్‌తో చిత్రానికి శరవేగంగా పూర్తి చేయగలిగాం. ఫస్ట్‌కాపీ సిద్ధమయింది. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై తదితర ప్రాంతాల్లో మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ‘ఆక్సిజన్’ చిత్రాన్ని రూపొందించాం. జగపతిబాబు ఈ చిత్రంలో ఓ కీలకపాత్రను పోషించారు. ఆయన నటన సినిమాకు పెద్ద హెల్ప్ అవుతుంది. సీజీ వర్క్ అద్భుతంగా చేశాం. యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలో రూపొందిన పాటలను ఈనెల 23న విడుదల చేయనున్నాం. నిజానికి ఈ చిత్రం ఆడియోను ఈనెల 15న నెల్లూరులో విడుదల చేయాలనుకున్నాం. కానీ అక్కడి వాతావరణం సహకరించకపోవడంతో వాయిదా వేశాం’’ అన్నారు. జగపతిబాబు, కిక్ శ్యామ్, అలీ, చంద్రమోహ న్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్ ప్రభాకర్, షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, వెనె్నల కిషోర్, తాగుబోతు రమేష్, సితార తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: పీటర్ హెయిన్స్, స్టంట్: సిల్వ, కొరియోగ్రఫీ: బృంద, సినిమాటోగ్రఫీ: వెట్రి-చోటా కె నాయుడు, ఎడిటింగ్: ఎస్.బి ఉద్దవ్, సంగీతం: యువన్ శంకర్‌రాజా, పాటలు: శ్రీమణి, రామజోగయ్య శాస్ర్తీ, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏ.ఎం. జ్యోతికృష్ణ.