ఎన్టీఆర్‌తో విక్రమ్‌కుమార్ చిత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు కె.విక్రమ్‌కుమార్ అంటే టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వుంది. 13బి, ఇష్క్, మనం, 24 లాంటి సినిమాలతో దర్శకుడిగా స్టార్ ఇమేజ్ అందుకున్న ఈయన ప్రస్తుతం అఖిల్‌తో ‘హలో’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ఎన్టీఆర్‌తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అఖిల్ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న విక్రమ్‌కుమార్ ఈ సినిమా తరువాత ఎన్టీఆర్‌తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. తాజాగా ఓ నిర్మాతతో ఈ విషయంపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్రివిక్రమ్ సినిమా తరువాత ఎన్టీఆర్‌తో చేయాలనే ఆలోచనలో ఉన్నాడట! అలాగే విక్రమ్ కుమార్‌తో సినిమా చేయడానికి అటు అల్లు అర్జున్ కూడా సిద్ధంగా ఉన్నాడు. మరి అటు ఎన్టీఆర్.. ఇటు అల్లు అర్జున్‌లు సిద్ధంగా ఉండడంతో విక్రమ్ తదుపరి సినిమా ఎవరితో ఉంటుందో చూడాలి. కాగా ఇప్పటికే ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు త్రివిక్రమ్, విక్రమ్‌కుమార్ వంటి క్రేజీ దర్శకులంతా ఆసక్తి చూపిస్తుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.