విజయ్ అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 61వ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అదిరింది’ తమిళంలో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్ రేంజ్‌కి దూసుకుపోతోంది. దాదాపు 100 కోట్లకో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అతి త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని 400 థియేటర్‌లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్రిస్టేజియస్ ప్రాజెక్టును మురళీ రామస్వామి, హేమా రుక్మిణీ, తెన్నాడండల్ స్టూడియోస్ ప్రై. లి. సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ స్వరాలందిస్తున్నారు. ఈ సందర్భంగా మురళీ రామస్వామి మాట్లాడుతూ- నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ అధినేత శరత్ మరార్‌తో కలిసి తెన్నాండల్ స్టూడియోస్‌పై తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అతిత్వరలో అందించనున్నాం. ఇప్పటికే తమిళంలో విడుదలై బ్లాక్‌స్టర్‌గా దూసుకుపోతోంది. ముఖ్యంగా యాక్షన్ అండ్ సెంటిమెంట్ ఎపిసోడ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులనుండి ప్రశంసల వర్షం కుపిస్తున్నారు. విజయ్ కెరీర్‌లో ది బెస్ట్ చిత్రంగా నిలవనుంది అన్నారు. శరత్‌మరార్ మాట్లాడుతూ- విజయ్ నటించిన అదిరింది లాంటి ప్రెస్టేజియస్ ప్రాజెక్టును తెలుగులో గ్రాండ్‌గా అతి త్వరలో విడుదల చేయబోతున్నాం. ఈ సినిమాతో విజయ్‌కి తెలుగులో క్రేజ్, ట్రేడ్‌లో బిజినెస్ రేంజ్ పెరుగుతుంది. నటీనటులు పోటాపోటీగా నటించారు. ఈ చిత్రాన్ని అతి త్వరలో తెలుగు ప్రేక్షకులకు అత్యధిక థియేటర్స్‌లో అందించబోతున్నాం అన్నారు. దీనికి విజయేంద్రప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, దర్శకత్వం: అట్లీ.