మహేష్‌తో క్రేజీ దర్శకుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో శేఖర్ కమ్ముల అంటే ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఆయన సినిమాలు చాలా క్లాస్‌గా ఉంటూనే మాస్‌ని ఆకట్టుకుంటాయి. లేటెస్టుగా వరుణ్‌తేజ్, సాయిపల్లవితో చేసిన ఫిదా నిజంగా అందర్నీ ఫిదా చేసింది. ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందన్న సందేహాలు ఎక్కువయ్యాయి. ఈ విషయం గురించి శేఖర్ అడిగితే, ఇప్పుడే తదుపరి సినిమా గురించి ఆలోచించడం లేదు అని చెప్పాడు. కానీ తాజాగా ఆయన కొత్త సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈసారి ఆయన మహేష్‌బాబుతో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్? ఇదివరకే మహేష్ కూడా శేఖర్‌తో సినిమా చేసేందుకు సిద్ధమని చెప్పాడు. మంచి స్క్రిప్ట్ కుదిరితే మహేష్‌తో సినిమా చేస్తానని చెప్పిన శేఖర్ కమ్ముల ఇప్పుడు ఆయన కోసం లీడర్ సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. రానాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. సో మహేష్‌తో లీడర్-2 చేస్తే ఖచ్చితంగా మరో రేంజ్ సినిమా అవ్వడం ఖాయం. చూద్దాం మరి ఈ సినిమా గురించి మహేష్ ఏమంటాడో..