ఎన్‌టిఆర్ సినిమాకు పవన్ క్లాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్‌టిఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం సోమవారం నానక్‌రాం గూడలోని రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా జరిగింది. ఈ క్రేజీ ప్రాజెక్టు పూజా కార్యక్రమానికి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్‌టిఆర్‌పై క్లాప్‌నివ్వడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇటు నందమూరి అభిమానులకీ, అటు మెగా అభిమానులకీ భలే ఆసక్తికరమైన సంఘటన ఇది. ఎన్‌టిఆర్ కెరీర్‌లో 28వ చిత్రమిది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పవన్‌కళ్యాణ్‌కు ఎదురుగా వెళ్లి ఎన్‌టిఆర్ ఘన స్వాగతం పలకడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా నడిచింది. పూజా కార్యక్రమానంతరం ఫొటో సెషన్ ప్రారంభమైంది. ఈ ఫొటో సెషన్‌లో పవన్ కళ్యాణ్ మధ్యలో ఉండాలంటూ ఎన్‌టిఆర్.. లేదు లేదు ఎన్‌టిఆరే మధ్యలో ఉండాలంటూ పవన్ పట్టుబట్టిన సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఎట్టకేలకు చివరకు పవన్ పట్టుబట్టి మీరే మధ్యలో ఉండాలంటూ ఎన్‌టిఆర్‌ను నిలబెట్టారు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ కార్యక్రమం అయిన కొద్ది నిమిషాల్లోపే ఈ సరదా సన్నివేశానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్‌చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ తదితరులతో రామానాయుడు స్టూడియో కళకళలాడింది. ఎన్‌టిఆర్‌కు విషెస్ చెప్పి పవన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్, ఆ సినిమా పూర్తయిన వెంటనే ఎన్‌టిఆర్ సినిమా పనులను ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది. అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో ఎన్‌టిఆర్ భార్య ప్రణతి, కుమారుడు అభయ్‌రామ్ తదితరులు పాల్గొన్నారు.