బండ్ల గణేశ్‌కు 2కంట్రీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా గత ఏడాది సంచలనం సాధించిన ‘2 కంట్రీస్’ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సొంతం చేసుకున్నాడు. మలయాళంలో దిలీప్, మమతామోహన్‌దాస్, ఇషాతల్వార్‌లు ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రం తక్కువ బడ్జెట్‌తో నిర్మితమై 50 కోట్ల మార్కెట్‌ను సాధించింది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా రీమేక్ హక్కులను భారీ కాంపిటీషన్ మధ్య బండ్ల గణేష్ సొంతం చేసుకున్నాడు. నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి, పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ హీరోలతో సినిమాలు తీశాడు. బ్లాక్‌బస్టర్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న గణేష్ మంచి సినిమాలు చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఓవైపు కథలు వింటూనే మరోవైపు క్రేజీ సినిమాల హక్కులను సొంతం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకురానున్నాడు.