సస్పెన్స్ థ్రిల్లర్ ది ప్రాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోడి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ది ప్రాంక్’. అర్జున్ కళ్యాణ్, పూజిత, ఐశ్వర్య, నోయల్ ప్రధాన తారాగణంగా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ పోస్టర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. మోషన్ పోస్టర్‌ను దర్శకుడు మారుతి, డిజిటల్ పోస్టర్‌ను రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేష్ కోడి చిత్ర విశేషాలు తెలియజేస్తూ- తెలుగు, హిందీ భాషల్లో బైలింగ్వల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, మొదటి షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను టాకీపార్ట్‌ను చిత్రీకరించామని తెలిపారు. తొలి షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన కథనం సరికొత్తగా వుంటుందని, తెలుగు తెరపై ఇప్పటివరకు రాని ప్రాంక్ నేపథ్య సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. సరదాగా ఎవరినైనా ఆట పట్టించడానికో, భయపెట్టడానికో ప్రాంక్ ఫోన్ కాల్స్ చేయడం, వీడియోలు రూపొందించడం, నేటి తరానికి సాధారణమైన విషయమే. అయితే తాజాగా ఇదే పాయింట్‌తో ఈ చిత్రాన్ని వైవిధ్యమైన కథనంతో రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుందని, సింగపూర్‌లో మొదలైన కథ, అనూహ్య మలుపులతో సాగుతూ హైదరాబాద్, గోవా, సింగపూర్ తదితర ప్రాంతాల్లో తిరుగుతుందని తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త జోనర్‌ను పరిచయం చేసే దిశగా ఈ చిత్రం వినోదం ప్రధానాకర్షణగా రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. ఓ ఇన్నోవేటివ్ పాయింట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం సరికొత్త ప్రయోగంగా ప్రేక్షకాదరణ పొందాలని దర్శకుడు మారుతి తెలిపారు. అనేక ప్రాంక్ వీడియోలను పరిశీలించి ఈ సినిమాకు మాటలు రాశానని రాకేష్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా:మధుసూదన్ కోట, సంగీతం: అమోఘ్, నిర్మాత, దర్శకత్వం: మహేష్ కోడి.