సంక్రాంతి బరిలో భాగమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాబోయే 2018 సంక్రాంతి సీజన్ రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, బాలకృష్ణ ‘జైసింహ’తో పోటీకి దిగుతుండగా స్టార్ హీరోయిన్ అనుష్క కూడా తన తర్వాతి సినిమా ‘్భగమతి’తో ఈ బరిలో నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న ఈ చిత్రం డిసెంబర్ నాటికల్లా పూర్తి సంక్రాంతి కానుకగా విడుదలవుతుందని తెలిసింది. అయితే ఈ విషయంపై నిర్మాణ సంస్థ నుండి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. అలాగే సంక్రాంతికి రవితేజ ‘టచ్ చేసి చూడు’ కూడా విడుదల కానుంది అంటున్నారు. మరి ఇన్ని సినిమాల మధ్య పోటీకి సిద్ధమవుతుండటంతో ‘్భగమతి’ ఏ స్థాయిలో వుంటుందో చూడాలనే ఆసక్తి ఎక్కువవుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా ఉండనున్నాయి. ‘పిల్లజమీందార్’ ఫేమ్ అశోక్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న చిత్రంలో ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్‌లు కూడా పలు కీలక పాత్రలు చేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత అనుష్క చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా అంతే భారీగా ఉన్నాయి.