ప్రేమతో మీ కార్తీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తికేయ, సిమ్రత్ ప్రధాన పాత్రలలో రిషి దర్శకత్వంలో రవీందర్ ఆర్.గుమ్మడికొండ రూపొందించిన చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 17న విడుదలకు సిద్ధం చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు రిషి మాట్లాడుతూ, కెమెరా విజువల్స్ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, ఫీల్‌గుడ్ మూవీగా రూపొందించామని అన్నారు. ఊరు వదలి విదేశాలు వెళ్లిపోయిన ఓ కొడుకు కోల్పోయిన జీవితాన్ని తన కొడుక్కు ఇవ్వాలని చేసిన ప్రయత్నమే ఈ చిత్రమని ఆయనన్నారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్‌కు మంచి స్పందన లభించిందని 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు నిర్మాత తెలిపారు. గొల్లపూడి మారుతీరావు, సుమిత్ర, మురళీశర్మ, పృథ్వి, ప్రగతి, ఝాన్సీ, దువ్వాసి తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు శ్రీమణి. కెమెరా-సాయిప్రకాష్, ఉమ్మడిసింగ్, సంగీతం-షాన్‌రెహ్మాన్, రచన, దర్శకత్వం- రిషి.