టాలీవుడ్‌లో మళ్లీ నటిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన పాత్రలతో దక్షిణాదిలో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది ఆండ్రియా. నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తూ క్రేజ్ తెచ్చుకున్న ఆండ్రియా తాజాగా విశాల్ సరసన ‘డిటెక్టివ్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదలవుతున్న సందర్భంగా ఆండ్రియా చెప్పిన విశేషాలు- థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం చాలా కొత్తగా వుంటుంది. తమిళంలో ఘనవిజయం సాధించడంతో తెలుగులో కూడా హిట్టవుతుందన్న నమ్మకముంది. ఇందులో నేను హంతకురాలిగా కనిపిస్తాను. నా పాత్ర పెద్దగా మాట్లాడదు. కానీ చాలా వేరియేషన్స్ చూపిస్తాను. ఈ సినిమా కోసం హార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను నడపడం నేర్చుకున్నాను. విశాల్‌తో పనిచేయడం చాలా ఆనందంగా వుంటుంది. సినిమా అంటే చాలా ఇష్టపడే వ్యక్తి. తెలుగు తమిళ భాషల్లో మంచి గుర్తింపువున్న హీరో. ఇప్పుడంతా కొత్తదనాన్ని ఆహ్వానిస్తున్నారు. భిన్నమైన సినిమాలకు మంచి అవకాశముంది. ప్రస్తుతం నేను నటించిన తమిళ్ ‘ఆవల్’ చిత్రం బాగా ఆడుతుంది. ఇది పూర్తిస్థాయి హారర్ ఎంటర్‌టైనర్. తెలుగులో కూడా ఈ సినిమా విడుదలకు ఎదురుచూస్తున్నాను. తెలుగులో కూడా స్ట్రెయిట్ చిత్రాలు చేయాలనుంది. అలాంటి మంచి అవకాశాలు వస్తే మళ్లీ తెలుగులో నటిస్తా.