ఎల్‌ఎల్‌బి చేసిన సప్తగిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సప్తగిరి, సోనాక్షివర్మ జంటగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో, డాక్టర్ రవికిరణ్ రూపొందించిన చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు సరికొత్త కథనాలతో సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నామని, చరణ్ అందించిన కథ ఈ చిత్రానికి హైలెట్‌గా వుంటుందని, కామెడీతో సాగే ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు నచ్చుతుందని, ఇందులో ప్రతి సీనులో నవ్వు ప్రేక్షకులను అలరిస్తుందని, తన కెరీర్‌లో ఈ చిత్రం హై బడ్జెట్‌తో తెరకెక్కిందని, నిర్మాతకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని అన్నారు. సప్తగిరికి తగిన విధంగా ఈ కథను డిజైన్ చేసామని, ఇప్పటికే విడుదలైన పలు పోస్టర్లకు, ఫొటోలకు మంచి స్పందన లభిస్తుందని, మాటలు, సంగీతం, కెమెరా పనితనం హైలెట్‌గా వుంటాయని దర్శకుడు చరణ్ అన్నారు. కార్యక్రమంలో సినిమా యూనిట్ పాల్గొని పలు విశేషాలు తెలిపారు.