రంగస్థలం క్రేజ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం- 1985’ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన విలేజ్ సెట్‌లో జోరుగా జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రంగస్థలం అనే గ్రామంలో 1985లో జరిగిన కథతో రూపొందుతుందట. దానికోసం ఆనాటి పరిస్థితులకు సంబంధించిన సెట్ కూడా వేసారు. భిన్నమైన కథాకథనాలతో సాగుతున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ సినిమా బిజినెస్ విషయంలో గట్టి పోటీ నెలకొందని, శాటిలైట్ హక్కుల విషయంలో భారీ పోటీ మధ్య ఓ ప్రముఖ చానల్ రూ. 16 కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ కెరీర్‌లో ఇదే భారీ బిజినెస్. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రానికి సంబంధించి హిందీలో కూడా రీమేక్ చేసేందు కు పలువురు బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సం క్రాంతికి విడుదల చేయాలని భావించింది చిత్ర యూనిట్.