డిటెక్టివ్‌గా కనిపిస్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా ‘జై లవకుశ’ విజయం తో జోరుమీదున్నాడు ఎన్‌టిఆర్. ఈ చిత్రం తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగే ఈ చిత్రం కోసం ఎన్‌టిఆర్ సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. అదేమిటంటే- ఇందులో ఎన్‌టిఆర్ డిటెక్టివ్‌గా కనిపిస్తాడని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే- ఎన్‌టిఆర్ కోసం త్రివిక్రమ్ ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసాడని అనుకున్నారు. కానీ తాజాగా ఆయన ఓ పాపులర్ నవల హక్కులను తీసుకున్నాడట. దాన్ని సినిమాగా మలిచి తనదైన మాటల మాయాజాలంతో తెరకెక్కిస్తాడని అంటున్నారు. ఇదివరకే నితిన్, సమంతలతో చేసిన ‘అ ఆ’ చిత్రం కూడా ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మీనా నవలకు ఆధారమని తెలిసింది. మొత్తానికి ఈ వార్త ఎన్‌టిఆర్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఇందులో ఎంత నిజానిజాలున్నాయన్నది తెలియాల్సి వుంది.