బిలాస్‌పూర్‌లో ఏం జరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనాథ్ మాగంటి, మేఘన జంటగా నాగేష్ మాకం దర్శకత్వంలో ఎం.ఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాసులు నిర్మిస్తున్న చిత్రం ‘బిలాస్‌పూర్ పోలీసుస్టేషన్’. పోలీసు నేపథ్యంలో తెరకెక్కిన థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత శ్రీనివాసులు వివరాలు తెలియజేస్తూ- ఎంటర్‌టైనింగ్‌గా వుంటూనే థ్రిల్ కలిగించే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలతో నిర్మిస్తున్నా మన్నారు. దర్శకుడు నాగేష్ మాట్లాడుతూ, యదార్థ సంఘటనల స్ఫూర్తితో అల్లుకున్న కథ ఇది. సహజమైన కథ కథనాలతో మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాం. బిలాస్‌పూర్ పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగే ఈకథలో ప్రేమ, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్ని ఎమోషన్లు వుంటాయన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తోట వి.రమణ, ఎడిటింగ్: ఉద్దవ్ ఎస్.బి., సంగీతం: సాబు వర్గీస్, పాటలు: సుద్దాల అశోక్ తేజ, నిర్మాత: మహంకాళి శ్రీనివాసులు, దర్శకత్వం: నాగేష్ మాకం.