పద్మావతికి సినిమా కష్టాలు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో ప్రఖ్యాత క్రేజీ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పద్మావతి’ మొదటి నుండీ సినిమా కష్టాల్నే ఎదుర్కొంటుంది. ఈ సినిమా విషయంపై చాలామంది ఫైర్ అవుతున్నారు కూడా. తాజాగా రాజస్థాన్‌లో ఈ చిత్రంపై నిరసనల వెల్లువ మరీ ఎక్కువైంది. ఇదివరకే కొందరు వ్యక్తులు షూటింగ్ కోసం వేసిన సెట్‌ను కాల్చేశారు. రాజస్థాన్‌లోని రాజపుత్ కర్ణి సేన ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన చేపట్టారు. దాంతో అక్కడ బంద్ వాతావరణం ఏర్పడింది. సంజయ్‌లీలా భన్సాలీ పద్మావతి కథను వక్రీకరిస్తున్నాడని వారు ధ్వజమెత్తారు. ఈ చిత్రంలో పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ప్రేమ సన్నివేశాలపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమాను తీస్తున్నారని, ఈ సినిమాను విడుదల చేయొద్దంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. దీన్ని బట్టి చూస్తే.. పద్మావతికి సినిమా కష్టాలు తప్పేలా లేవు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదలకు సన్నాహాలు చేసిన నేపథ్యంలో అసలు సినిమా విడుదలవుతుందా? లేదా? అన్న అనుమానాలు సైతం ఎక్కువయ్యాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొనె, రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.