బ్లాక్‌బస్టర్ హిట్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ‘గరుడవేగ’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి తమ యూనిట్‌కు ఆనందాన్ని ఇస్తోందని దర్శకుడు ప్రవీణ్ సత్తారు అన్నారు. పూజాకుమార్ కథానాయికగా జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై రూపొందించిన ‘గరుడవేగ’ గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన విజయోత్సవ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అంతా పాల్గొని తమ అనుభవాలను తెలిపారు. ప్రారంభ సమయంలో సినిమా గురించి అనేక నెగెటివ్ కామెంట్స్ వచ్చాయని, వాటికి సమాధానంగా ఈ రోజు చిత్రం విజయవంతం అయిందని, మంచి కానె్సప్టు వున్న చిత్రాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయని ఈ సినిమా మరోసారి నిరూపించిందని దర్శకుడు ప్రవీణ్ సత్తారు అన్నారు. రాజశేఖర్ కాంబినేషన్ అంటే ఓ కొత్త ప్రయత్నం అన్న భావనతో మొదట అంచనాలేవీ లేవని, వాటన్నింటినీ కాదని ప్రజలు సక్సెస్‌ను అందించారని ఆయన అన్నారు. కథ ముఖ్యం కాదనీ ఎంత ఖర్చు చేస్తున్నామనేది ముఖ్యం కాదని, టెక్నికల్‌గా మంచి టీమ్ దొరికిందని తెలిపారు. ఏ ముహూర్తాన దర్శకుడు ఈ కథను చెప్పాడో అదే విజయం అవ్వడానికి ప్రధాన కారణమని, తన కెరీర్‌లో పెద్ద హిట్ కాకుండా బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలవడం చాలా ఆనందాన్నిస్తోందని హీరో రాజశేఖర్ అన్నారు. ఈ సినిమా రిలీజ్ సమయంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, సినిమాపై భారీ అంచనాలు ఏవీ లేవని, కానీ ప్రేక్షకులు సినిమాను ఆదరించి నిలబెట్టారని ఆయన అన్నారు. కార్యక్రమంలో శ్రద్ధాదాస్, జీవిత, నిరంజన్, రాజేష్, ఆదిత్ పాల్గొన్నారు.