’గల్ఫ్‌‘విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల నా దర్శకత్వంలో విడుదలైన ‘గల్ఫ్’ చిత్రం ప్రేక్షకులకు దగ్గరైంది. గల్ఫ్ బాధితులపై, వారి జీవిత కథలను ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇది కొత్త ఉత్సాహాన్నిచ్చింది. యుఎస్, ఆస్ట్రేలియా దేశాలలో కూడా విడుదల చేశాం. ఈ చిత్రం తరువాత ఒక క్రైం కథకు సీక్వెల్‌గా రొమాంటిక్ క్రిమినల్స్ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నాం, ఈ నెల 15 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. చేతన్, డింపుల్ హయతి జంటగా శ్రావ్య ఫిలింస్ పతాకంపై యక్కలి రవీంద్రబాబు, ఎం.ఎస్.కుమార్ రూపొందించిన ‘గల్ఫ్’ చిత్రం విజయవంతంగా 25 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా విజయోత్సవాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. ఇంకా దర్శకుడు మాట్లాడుతూ- గ్రామీణ ప్రాంతాలనుండి మంచి కథను తీసుకుని ఈ సినిమాను రూపొందించామని అందరూ చెబుతుండడం ఆనందాన్ని ఇస్తోందని, గల్ఫ్ చిత్రానికి కూడా సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నామని ఆయన అన్నారు. తమ సంస్థలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రంగా గల్ఫ్ విడుదలైందని, చిన్న సినిమాలకు ఆదరణ పెద్దగా లేని ఈ సమయంలో తమ సినిమా విజయాన్ని అందుకున్నందుకు ఆనందంగా వుందని నిర్మాత యక్కలి రవీంద్రబాబు తెలిపారు. కార్యక్రమంలో కథానాయకుడు చేతన్, నిర్మాత బాపిరాజు పాల్గొని విశేషాలు తెలిపారు.