రాక్‌స్టార్‌గా గ్లామర్ భామ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామగా సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ శృతిహాసన్ ఈమధ్య దక్షిణాదిలో సినిమాలు చేయడానికి ఎక్కవ ఆసక్తి చూపడంలేదు. ఆమె ఫోకస్ మొత్తం బాలీవుడ్‌పైనే వుంది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలగాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కమర్షియల్ విజయం మాత్రం దక్కడంలేదు. అయినా ఆమె ప్రయత్నం మాత్రం వదలడంలేదు. ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా చేస్తున్న ఈ అమ్మడు కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. అదేమిటో తెలుసా, రాక్‌స్టార్‌గా మారుతుందట. శృతిహాసన్‌కు మొదటినుండీ మ్యూజిక్ పట్ల చాలా ఆసక్తి వున్న విషయం తెలిసిందే. మొదట్లో సినిమా కోసం పాట కూడా పాడిన ఈ అమ్మడు, ఇకపై మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తుందిట. ఇదివరకు టైం దొరక్క మ్యూజిక్‌పై ఫోకస్ పెట్టలేదని, కానీ ఈసారి మాత్రం మ్యూజిక్ ఆల్బమ్స్ విడుదల చేస్తానని అంటోంది. ఇదివరకే కమల్‌హాసన్ నటించిన ‘ఈనాడు’ సినిమాకు టైటిల్ సాంగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ మరి సినిమాలకు కూడా మ్యూజిక్ డైరైక్టర్‌గా మారుతుందో ఏమో చూడాలి.