సుకుమార్‌తో సినిమాకు మహేష్ ఆసక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు సినిమాల విషయంలో బాగా స్పీడ్ పెంచాడు. అప్పట్లో ఒక్క సినిమాకోసం ఏకంగా రెండేళ్ల టైం తీసుకునే మహేష్ ఈమధ్య ఆరునెలల్లో షూటింగ్ పూర్తిచేసి నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే 24వ చిత్రంగా కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు మహేష్. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ముఖ్యమంత్రి ఛాంబర్ సెట్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. దాంతోపాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా, త్రివిక్రమ్ దర్శకత్వంలో 26వ సినమాలకు కమిట్ అయ్యాడు. తాజాగా 27వ సినిమా గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీనుతో తెరకెక్కించేందుకు నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తుండగా.. మహేష్ మాత్రం సుకుమార్‌తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. పైగా నిర్మాతలకు కూడా అదే విషయం చెప్పడంతో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే అక్కడ మహేష్‌తో సినిమా చేస్తామని బోయపాటి శ్రీనుకు మాట ఇవ్వడంతో వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు. ‘1 నేనొక్కడినే’ సినిమా తరువాత మళ్లీ సుకుమార్‌తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు మహేష్. అందుకే తన 27వ సినిమాను సుకుమార్‌తోనే సెట్ చేయమని చెప్పాడట. తన ఫేవరెట్ బ్యానర్ అయిన 14 రీల్స్ నిర్మించే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం వుంది.