భిన్నమైన ప్రేమకథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటుడు శ్రీకాంత్, హేమలత జంటగా వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో బుధవారం ఉదయం జరిగింది. హేమలతారెడ్డి నిర్మాణంలో కె.గోవర్థనరావు దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు సన్నివేశానికి మల్టీ డైమెన్షన్ వాసు క్లాప్‌కొట్టగా, సరోవరం నిర్మాత శ్రీలత కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ- ఈనెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తానని, దాదాపు 50 నుండి 60 రోజులపాటు షూటింగ్ చేస్తామని అన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని, తమ సంస్థలో రూపొందిస్తున్న రెండవ చిత్రం ఇదని, ఇప్పటికే ఓ సినిమా పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామన్నారు. తాను అతిథి పాత్రలో కాకుండా పూర్తి స్థాయి రోల్‌లో ఈ చిత్రంలో నటిస్తున్నానని నటుడు భానుచందర్ అన్నారు. అమలాపురంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఆంధ్ర, తెలంగాణాలో షూటింగ్ చేస్తామని దర్శకుడు తెలిపారు. సుమన్, సన, కాశీ విశ్వనాధ్, రజిత, విద్య, లత, నిహాల్, వేణు, మహేష్, ఫణి, రమణ, వెనె్నల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:కరణ్ గోపిని, కథ:వీరభద్ర క్రియేషన్స్, కెమెరా:ప్రసాద్ ఈదర, సంగీతం:రమణ రాధోడ్, నిర్మాత:హేమలతారెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కె.గోవర్థనరావు.