అజయ్ ‘స్పెషల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజయ్ ప్రధానమైన పాత్రలో రంగ, అక్షిత జంటగా నందలాల్ క్రియేషన్స్ పతాకంపై వాస్తవ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘స్పెషల్’. ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాలను షూటింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వాస్తవ్ మాట్లాడుతూ- ఒక మనిషి తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తనకు వచ్చిన ఓ కళ ద్వారా ఎలా ప్రయత్నించాడు? చివరికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్న వైవిధ్యమైన పాయింట్‌తో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. తనలో వున్న వైవిధ్యమైన స్కిల్‌ను ఉపయోగించి నమ్మలేని విధంగా ఎలా శత్రువును మట్టికరిపించాడు అనేదే ఈ సినిమా కథనం అని, దెబ్బతిన్న పులిలాంటి వ్యక్తి అసాధారణ ప్రతీకార ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలెట్‌గా వుంటుందని తెలిపారు. అజయ్ స్పెషల్ ఇనె్వస్టిగేషన్ ఆఫీసర్‌గా, మైండ్ రీడ్ చేసి క్రైమ్ వెనుక వున్న నిజానిజాలను వెలికితీసే పాత్రలో నటించాడని, ఆయన కెరీర్‌లో ఈ సినిమా మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని తెలిపారు. హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుందని మోషన్ పోస్టర్‌ను వచ్చేవారం విడుదల చేసి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఆయన అన్నారు. సంతోష్, అశోక్‌కుమార్, చక్రపాణి, జబర్దస్త్ అప్పారావు, ప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అమర్‌కుమార్, ఎడిటింగ్: ఉద్ధవ్, సంగీతం: ఎన్.వి.ఎస్.మణ్యం, నిర్మాణం: నందలాల్ క్రియేషన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వాస్తవ్.