24న అల్లుడు సింగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాపింగ్ మాల్, జర్నీ, గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ సినీ రంగాల్లో కథానాయికగా తనదైన గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ అంజలి రెండు రెండు షేడ్స్‌లో నటించిన చిత్రం ‘అల్లుడు సింగం’. సత్యదేవ పిక్చర్స్ బ్యానర్‌పై విమల్, అంజలి జంటగా రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ని రావిపాటి సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా రావిపాటి మాట్లాడుతూ- ‘పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీగా రూపొందిన ‘అల్లుడు సింగం’ చిత్రంలో సరికొత్త గ్లామర్ లుక్‌తో ఇప్పటి వరకు మరే సినిమాలో చేయని విధంగా లాయర్, పొలిటీషియన్‌గా రెండు షేడ్స్ వున్న క్యారెక్టర్‌లో కనిపించనుంది. లవ్, యాక్షన్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాధారవి నటన, హాస్యనటుడు సూరి కామెడీ సినిమాకు పెద్ద ఎస్సెట్ అవుతాయి. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ సినిమా టైటిల్స్‌తో ‘వచ్చాడు వచ్చాడు బొబ్బిలి సింహం’ పాటను ప్రత్యేకంగా రాయించాం. ప్రస్తుతం సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 24న విడుదలకు సిద్ధమయింది’’అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎన్. ఆర్. రఘునందన్, మాటలు: వెంకట్, నిర్మాత: రావిపాటి సత్యనారాయణ, దర్శకత్వం: రాజశేఖర్.