బాలు పాటతో శివకాశీపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు రాజేష్ శ్రీచక్రవర్తి కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘శివకాశీపురం’. సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై హరీశ్ వట్టికూటి దర్శకత్వంలో మోహన్‌బాబు పులిమామిడి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కథానాయికగా ప్రియాంక శర్మ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటను విడుదల చేశారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మెచ్చి పాడిన ఈ పాట అమ్మగొప్పదనాన్ని తెలిపేలా వుంటుందని దర్శకుడు తెలియజేస్తున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ‘అమ్మ అందని త్యాగం కోటి దైవాల రూపం’ అనే పాటకు పవన్ శేష సంగీతం అందించగా బాలు ఆలపించారని, అమ్మ గొప్పతనం ఇప్పటివరకు ఎన్నో పాటల రూపంలో వచ్చినా ఈ పాటలోని డెప్త్ కథకు సంబంధించి అద్భుతంగా కుదిరిందని అన్నారు. పాటలోని ఆంతర్యం అర్థం చేసుకుని ఆయన ఎంతో మక్కువతో ఈ పాట ఆలపించడం తమ సంస్థకు గర్వకారణమని తెలిపారు. గులాబి, లవ్‌స్టేట్స్ చిత్రాలకు సంగీతం అందించిన తాను, మూడవ చిత్రంగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నానని, అమ్మ పాట ఈ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని సంగీత దర్శకుడు పవన్ శేష అన్నారు. చమ్మక్ చంద్ర, సూర్య, జబర్దస్త్ రాము, దిల్ రమేష్, నవీన్ జబర్దస్త్, లక్ష్మి, రవీందర్, మాస్టర్ హరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:జి.రామిరెడ్డి, ఎడిటింగ్: జియోజి థామస్, నిర్మాత: మోహన్‌బాబు పులిమామిడి, రచన, దర్శకత్వం: హరీశ్ వట్టికూటి.