రివేంజ్ డ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతా ర ఎప్పటికప్పుడు రిటైర్‌మెంట్ ప్రకటిద్దామనుకునే లోపు ఆమెకు అమాం తం స్టార్‌డమ్ వస్తోంది. క్రేజ్ తగ్గకపోవడంతో ఎప్పటికప్పుడు అవకాశాలందుకుంటూ అప్‌డేట్ అవుతోంది. ఇప్పటికే ఆమెతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు కూడా సిద్ధమవుతున్నారు. ఆమె మాత్రం కోలీవుడ్‌పైనే తన ఫోకస్ పెట్టింది. దానికితోడు సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల తీరునుబట్టి చూస్తే, ఆమె టార్గెట్ మరోలా వుందనిపిస్తుంది. కోలీవుడ్ ప్రేక్షకులు తనపై అనేక రకాల కామెంట్స్ చేశారు. ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అందుకే వాటికి ప్రతీకారంగా కోలీవుడ్‌లోనే ఉండి జవాబు చెప్పాలనుకుంది. తాజాగా మురుగదాస్ విషయంలో ఫైర్ అయ్యిందట ఆమె. అప్పట్లో గజిని చిత్రంలో నటించినా తన పాత్రకు ఏ మాత్రం ప్రాముఖ్యం ఇవ్వకుండా అసిన్ పైనే ఫోకస్ పెట్టాడని ఆమె బాధ. అందుకే మురుగదాస్ చిత్రాల్లో నటించడానికి నో చెప్పింది. కత్తి సినిమా కథ నాదంటూ ఆమధ్య ఓ కేసు పెట్టాడు గోపీనాయర్ అనే వ్యక్తి. తాజాగా గోపీనాయర్‌తో సినిమా చేయడానికి నయనతార గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇదంతా మురుగదాస్‌పై కోపంతోనే చేస్తోందని కోలీవుడ్ భోగట్టా. శింబుతో కలిసి నెల్సన్ అనే దర్శకుడితో ఓ సినిమా చేసింది. మళ్లీ నెల్సన్ దర్శకత్వంలోనే నటించడానికి సిద్ధమైంది. ఇపుడు మాత్రం శింబుపై పగ తీర్చుకోవడానికే ఈ సినిమా చేస్తుందని చెబుతున్నారు. మొత్తానికి రివెంజ్ తీర్చుకుంటోంది నయనతార.