సామాజిక సమస్యలపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలల చిత్రాలు పిల్లలతో పాటుగా తల్లిదండ్రులలోనూ సామాజిక సమస్యలపట్ల అవగాహన పెంచేలా వుండాలని బాలల చిత్ర దర్శక నిర్మాత సంతోష్ పాండా అభిప్రాయం వ్యక్తం చేశారు. 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో భాగంగా ఆయన రూపొందించిన ‘శభాష్ బిజ్జు’ చిత్రాన్ని శనివారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఐమాక్స్ థియేటర్‌లో చలన చిత్రోత్సవ మీడియా సెంటర్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. మాజీ ఒరిస్సా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందించానని ఆయన తెలిపారు. కీలక ప్రజా సమస్యల ఆధారంగా అనేక సంక్షిప్త చిత్రాలు తాను రూపొందించానని, ఇదే ఉత్సాహంతో కథ ప్రధానంగా బాలల హక్కులు ముఖ్యం గా బాల కార్మికుల హక్కులను ఈ సినిమా చర్చించిందని ఆయన అన్నారు. 11 ఏళ్ల బాలుడు బిజు బాల కార్మికులను బడి బాట పట్టించే ప్రయత్నంలో ఎదురయ్యే సమస్యల చుట్టూ ఈ చిత్రం సాగిందని, బాలల సినిమాల నిర్మాణంలో అనేక ఇబ్బందులున్నా అందులో ఆనందం కూడా వుంటుందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో నటించడానికి పలువురు చిన్నారులకు వర్క్‌షాప్ నిర్వహించామని, షూటింగ్ 15 రోజుల్లో పూర్తయినా సినిమా పూర్తిచేయడానికి మూడు నెలల సమయం పట్టిందని, వారితో కలిసి పనిచేయడం ఓ మంచి అనుభవమని తెలిపారు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ, ఇండియా చక్కగా నిర్వహిస్తోందని సంతోష్ పాండా ఆనందం వ్యక్తంచేశారు.