బాలకృష్ణుడు 24న వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేయాలనే అనుకుంటా. మంచి కథ దొరికితే కమర్షియల్ చిత్రాలు చేయడానికి కూడా సిద్ధం. ఇదే సమయంలో దర్శకుడు పవన్ ‘బాలకృష్ణుడు’ కథతో వచ్చారు. నాపై నమ్మకంతో వచ్చినందుకు పూర్తి ఎఫర్ట్ పెట్టి నటించాను. నేను ఫిజిక్ పరంగా తగ్గానంటే ఆ క్రిడిట్ పవన్‌కే చెందుతుంది అని హీరో నారా రోహిత్ తెలిపారు. సరస్‌చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్, మాయాబజార్ మూవీస్ పతాకంపై నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో బి.మహేంద్రబాబు, ముసునూరు వంశి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘బాలకృష్ణుడు’. చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని సమంత వ విడుదల చేయగా, బిగ్ సీడీని సాయి ధరమ్‌తేజ్ ఆవిష్కరించారు.
సినిమాను ఈ నెల 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నారా రోహిత్ ప్రకటించారు. తాను అనుకున్న విజువల్స్‌ను 200 శాంతం తెరపై ఆవిష్కరించిన కెమెరామెన్ విజయ్ సి.కుమార్‌కు ధన్యవాదాలు అని దర్శకుడు పవన్ మల్లెల తెలిపారు. ఈ సినిమాలో తానూ ఒక పాట పాడానని కథానాయిక రాశీఖన్నా అన్నారు. సమంత మాట్లాడుతూ- ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. ట్రైలర్ చూస్తే పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం వుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో కల్యాణకృష్ణ, మారుతి, నాగశౌర్య, దిల్‌రాజు, వెనె్నల కిశోర్, సత్య, విద్యుల్లేఖా రామన్, బెల్లంకొండ సురేష్, సాయి కార్తీక్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రమ్యకృష్ణ, పృధ్వీ, కోట శ్రీనివాసరావు, ఆదిత్యా మీనన్, దీక్షాపంత్, అజయ్, వెనె్నల కిశోర్, దువ్వాసి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:మణిశర్మ, మాటలు:కొలుసు రాజా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పవన్ మల్లెల.