తప్పుడు ప్రచారం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం రోజుల్లో అతి తెలివిని ఉపయోగించి కొంద రు యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్న వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఎక్కువగా సినీ తారలపై నెగెటివ్‌గా ప్రచారాలను చేస్తూ యూట్యూబ్‌లో చానెల్ పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా ఇదే తరహాలో టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుపై కూడా ఎవరూ ఊహించనటువంటి కథనాలు వెలువడ్డాయి. ఆయన ఆరోగ్యం బాగోలేదని, అస్వస్థతకు గురయ్యారని కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ కథనాలపై కోట శ్రీనివాసరావు ఖండించారు. తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలుపుతూ, తప్పుడు వార్తలను ప్రసారం చేసిన యూ ట్యూబ్ చానెల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తాను కేవలం ఎంపిక చేసుకొన్న చిత్రాల్లో మాత్రమే నటిస్తున్నానని చెబుతూ.. చిత్ర పరిశ్రమలో పరిస్థితులు చాలా మారాయని వివరించారు.