ఇంద్రసేన వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంటోని కథానాయకుడిగా ఆర్ స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకాలపై జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధికా శరత్‌కుమార్, ఫాతి మా విజయ్ ఆంటోని సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ఇంద్రసేన’. తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 30న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- డిఫరెంట్ కథనాలతో సినిమాలు రూపొందిస్తూ తన మార్కెట్‌ను పెంచుకున్న విజయ్ ఆం టోని తాజాగా నటించిన చిత్రం ఇదని, భేతాళుడు, యెమన్ చిత్రాలతో కమర్షియల్ హీరోగా నిలబడ్డారని, ప్రస్తుతం బ్రదర్ సెంటిమెంట్‌తో ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారని తెలిపారు. హైలీ ఎమోషన్ కాంబినేషన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని, ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు, ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోందని వారు తెలిపారు. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఈ సినిమా వుంటుందని వారు అన్నారు. డైనా చంపిక, మహిమ, రాధా రవి, కాళి వెంకట్, నళినికాంత్, రిందు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు:్భషాశ్రీ, సంగీతం, ఎడిటింగ్:విజయ్ ఆంటోని, కెమెరా:కె.దిల్‌రాజ్, దర్శకత్వం: జిశ్రీనివాసన్.