‘గరుడవేగ’తో మరింత గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో బాహుబలి తర్వాత ఎడిటింగ్ విషయంలో 4కె రిజల్యూషన్ సాంకేతికత వాడిన ఒకే ఒక చిత్రం ‘గరుడవేగ’ అని అంటున్నాడు ఎడిటర్ ధర్మేంద్ర. రాజశేఖర్, పూజాకుమార్ జంటగా ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గరుడవేగ’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల చెప్పిన విశేషాలు... ఇప్పటివరకు చాలా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశాను. కానీ ‘గరుడవేగ’తో ఘనవిజయం దక్కడమే కాకుండా సాంకేతిక నిపుణిడిగా మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలోని సన్నివేశాలు, యాక్షన్ దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయంటూ పలువురు ఫోన్ చేసి చెబుతున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 4కె రిజల్యూషన్‌ను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడంవల్లే ఇంత క్వాలిటీ వచ్చింది. దానికోసం నిర్మాతకు అదనపు బడ్జెట్ పడింది. ప్రవీణ్ సత్తారుతో వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఆయన టెక్నికల్ విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా టెక్నిషియన్‌కు కావాలిసిన స్వేచ్ఛను ఇవ్వడంలో ముందుంటారు. నిజానికి ఈ సినిమా మూడుగంటలకు పైగా నిడివితో ఉంటుంది. కాని, దానిని చాలా కుదించాం. సత్యజిత్రే ఫిలిమ్ ఇనిస్టిట్యూట్‌లో డిప్లొమా చేశాను. ఆ తర్వాత సురేష్‌బాబు పరిచయం అవ్వడంతో ఆయన సహకారంతో ఎడిటిర్ శంకర్ వద్ద అసోసియేట్‌గా పనిచేశాను. దాసరి నారాయణరావుతో ఐదు సినిమాలు చేశాను. దేవకట్ట దర్శకత్వం వహించిన ‘ప్రస్థానం’తో నా సినీ కెరీర్ ప్రారంభమైంది. ఇప్పటివరకు 20కి పైగా చిత్రాలు చేశా. ప్రతి కథలోను సన్నివేశాలకు తగ్గ ఎమోషన్, సౌండ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఇక మళ్లి ప్రవీణ్ సత్తారుతో రెండు సినిమాలు చేయబోతున్నా. వాటిలో ఒకటి భారీ చిత్రమని అన్నారు.