బాలల చిత్రాల నిర్మాణం సామాజిక బాధ్యత కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం-2017 అత్యంత సందడిగా సాగింది. ఐదవ రోజైన ఆదివారం సెలవు కావడంతో చిత్రోత్సవాలు జరిగే వేదికలు కళకళడాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఐ-మాక్స్‌కు భారీగా పిల్లలు తరలి రావడంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. పిల్ల లు అత్యంత ఉత్సాహంగా పలు చిత్రాలను తిలకించారు. బాలల చిత్రా లు రెండేళ్ళకు ఒకసారి కాకుండా ప్రతి ఏడాది నిర్వహించాలని వారు కోరుకుంటున్నారు. ముఖ్యంగా బాలల చిత్రాలను నిర్మించేందుకు పలువురు ముందుకు రావాలని, దీనిని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ సందర్భంగా ‘ఇందీవరం’ అనే షార్ట్ ఫిలిమ్ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత రాము ఇరగవరపు మాట్లాడుతూ బాలల చిత్రాలను నిర్మించే దర్శక నిర్మాతలకు సామాజిక బాధ్యత అవసరమని, కేవలం పిల్లలకు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు, సమాజంలోని ఇతర వర్గాలకు చక్కని సందేశం ఇచ్చే సినిమాల నిర్మాణంపై దృష్టి నిలపాలని అన్నారు. ‘ఇందీవరం’ చిత్రం వరుసగా రెండవసారి ‘ఆసియన్ పనోరమ’ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైందని తెలిపారు. అక్రమమార్గంలో వచ్చిన డబ్బును ఖర్చు చేసేందుకు ఇష్టపడని ఓ చిన్నారి కథే ఈ చిత్రమని తెలిపారు. కథా రచయత మూర్తి కనకాల మాట్లాడుతూ పిల్లల మనోభావాలను దగ్గరగా చూసిన అనుభవంతో ఈ కథను రూపొందించానని అన్నారు.