చిత్రోత్సవం బాలల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చారిత్రాక నగరం హైదరాబాద్‌లో గత వారం రోజులుగా జరుగుతున్న 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులతో సందడే సందడిగా మారి వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచిందని టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు, మైనార్టీ జర్నలిస్ట్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి షరీఫ్ మహమ్మద్ అన్నారు. గత వారం రోజులుగా ఐ మ్యాక్స్‌లో ప్రదర్శిస్తున్న వివిధ దేశాలకు చెందిన చిత్రాలను క్రమం తప్పకుండా చూస్తున్న ఆయన మంగళవారం మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఈ ఉత్సవాలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిదని షరీఫ్ కొనియాడారు. ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఈ 20వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో తెలుగు చిత్రాలు వివిధ విభాగాలలో ఏడు ప్రదర్శనలకు ఎంపిక కావడం విశేషమనీ, రెండేళ్ల క్రితం నిర్వహించిన బాలల చలనచిత్రోత్సవంలో కనీసంగ ఒక్క తెలుగు చిత్రం కూడా ఎంపికకాలేదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ ఏడు ఇందీవరం, స్నేహితుడు, ఎగిసే తారాజువ్వలు, డూ డూ ఢీ ఢీ, శాను, మట్టిలో మాణిక్యాలు, పూర్ణ చిత్రాలు ఎంపికయ్యాయని, ఇక ముందు ఈ సంఖ మరింతగా పెరగాలని ఆయన ఆకాంక్షించారు. అయితే ఏదో బాలల చిత్రం తీశాం.. అంటే తీశాం అన్నట్లుగా కాకుండా వాటిలో సరుకు, సందేశం, స్ఫూర్తిదాయకంగా ఉండేలా దర్శక, నిర్మాతలు జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, జీవితానికి అద్దంపట్టే సృజనాత్మక చిత్రాలకు, బాలల చలనచిత్రాలకు స్థాయినిబట్టి ఐదు నుంచి యాభై లక్షల రూపాయల దాకా సబ్సిడీ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉండడం అభినందించతగ్గ విషయమని, ఇంతేకాకుండా బాలల చిత్రాలను, చిన్న సినిమాలను ప్రోత్సహిస్తూ, ప్రత్యేకంగా ఐదో షో కూడా వేసుకునే వెసులుబాటు కల్పించనుండటం హర్షించతగ్గ విషయమన్నారు. బాలల చిత్రాలు స్ఫూర్తిదాయకంగా, నైతిక విలువలను పెంచే విధంగా ఉండి తీరాలని షరీఫ్ అభిప్రాయ పడ్డారు. భారతీయ చిత్రాల్లో మన సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప పాశ్చాత్య సంస్కృతికి పట్టం కట్టడం ఎంతైనా ప్రమాదమని ఆయన అన్నారు. ఎంతోకాలంగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహిస్తున్నా, పెద్ద సంఖ్యలో మంచి బాలల చిత్రాలు నిర్మించడం లేదంటే ఇక్కడ అలాంటి చిత్రాలకు ప్రాధాన్యత లేకపోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. లోగడ ప్రభుత్వాలు పనికి మాలిన చిత్రాలకు ఆర్థిక సహాయం చేశాయనీ, బాలల కోసం నిర్మించే చిత్రాలను విస్మరించాయని ఆయన పేర్కొన్నారు. భారతీయ పురాణాలు, చరిత్ర పంచతంత్ర కథలకు మించిన కథల గని మనదేశంలో తప్ప మరే దేశంలో లేదని ఆయన తెలిపారు. ఇలాంటి అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో స్థానిక దర్శక, నిర్మాతలకు ప్రాధాన్యతనిస్తే మరిన్ని మంచి బాలల చిత్రాలు తప్పకుండా వెలుగుచూస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బాల్యంలో ఏర్పడిన విశ్వాసాలే, వారు పెరిగిన తర్వాత వారిలో బలంగా పాదుకొంటాయనీ, అందుచేత అంధ విశ్వాసాలకు దూరంగా బాలల పెంపకం జరగాలని ఆయన పేర్కొన్నారు. బాలల్లో చిన్ననాటి నుంచే చక్కని ప్రవర్తనకు దారులు వేసే విశ్వాసాలను మాత్రమే కలిగించే విధంగా ప్రజాజీవితం, విద్యావ్యవస్థ రూపుదిద్దుకోవాలన్నారు. ఇందుకుగాను పరిసరాల సమస్యలు, జంతు సంరక్షణ, ఇత్యాది అంశాలను ఆయన ప్రస్తావించారు. ‘పూర్ణ’ లాంటి చిత్రాల ద్వారా బాలలకు మంచి సందేశం ఇవ్వవచ్చన్నారు. ఒక ‘పూర్ణ’, ఒక ‘వెండి’ (జర్మనీ)లాంటి చిత్రాలు బాలల్లో ఆసక్తిని కలిగించి వారిని ఆలోచింపజేశాయన్నారు. సాంకేతికంగా ఏ విభాగంలో లేనప్పటికీ తన 13 సంవత్సరాల 11 నెలల వయసులో అత్యున్నతమైన హిమాలయ పర్వత శ్రేణిలోని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సాహసబాలిక మాలవత్ పూర్ణ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘పూర్ణ’ బాలల్లో ఆత్మస్థయిర్యాన్ని పెంపొందించిదని, ఇలాంటి చిత్రాలకు ఎప్పటికీ ఆదరణ వుంటుదని ఆయన అన్నారు. సంగీత దర్శకుడు నల్లూరి సుధీర్‌కుమార్ మాట్లాడుతూ అత్యంత వైభవంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలను చూసైనా మన నిర్మాతల్లో కదలిక రావాలని, బాలల చిత్రాలకు సబ్సిడీలు ఇస్తున్నా, వాటి వైపు మన నిర్మాతలు కనె్నత్తికూడా చూడడం లేదని అన్నారు. అంతర్జాతీయంగా మన హైదరాబాద్‌లో ఈ వేడుకలు జరగడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. నిర్మాత, దర్శకుడు ఎల్.త్రినాథ్‌రావు మాట్లాడుతూ బాలల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపే చిత్రాలు మన భారతీయ భాషల్లో విరివిగా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని నిర్మాతల్లో కదలిక రావాలని, వారి నుంచి మంచి బాలల చిత్రాలు తెరకెక్కాలని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్ర నిర్మాతలు, దర్శకులు, మరీ ముఖ్యంగా బాలల చిత్ర నిర్మాతలు, దర్శకులపై గురతర బాధ్యత ఉందనీ, అందుచేత కేవలం పిల్లలకు మాత్రమే కాకుండా, వారి తల్లిదండ్రులు, సమాజంలోని ఇతర వర్గాలకు చక్కని సందేశం ఇచ్చే సినిమాల నిర్మాణంపై వారు దృష్టిసారించాలని చెప్పారు. బాలల చిత్రాలను నిర్మించే నిర్మాత, దర్శకులు పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచే విధంగా చక్కని కథలను తెరకెక్కించాలని కోరారు. యానిమేషన్ చిత్రాల నిర్మాణం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అది ఓ పెద్ద సవాల్ అనీ, ప్రపంచ దేశాలన్నింటిలో చిత్రాన్ని ప్రదర్శించడం మరో పెద్ద సవాల్ అని అన్నారు. ఈ బాలల చిత్రోత్సవానికి చిన్నారుల నుంచి అనూహ్య స్పందని వచ్చిందన్నారు. ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లల కేరింతలు చూసినప్పుడు మనసు ఆనందంతో ఉప్పొంగిందన్నారు. బాలల చిత్రాలు వినోదంతో పాటుగా విజ్ఞానాన్ని, చక్కని సందేశాన్ని అందించాలని షరీఫ్ అభిప్రాయపడ్డారు. బాలల చిత్రాలు పిల్లలను తేలిగ్గా ప్రభావితం చేస్తాయని తెలిపారు.