ఎట్టకేలకు కదిలిన నందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నంది అవార్డుల పండుగకు వేదిక సిద్ధమైంది. 2014, 2015 మరియు 2016 సంవత్సరాలకుగాను అవార్డుల ఉత్సవం ఇంతవరకు ప్రకటించని విషయం పాఠకులకు తెలిసిందే. మూడు సంవత్సరాలకుగాను ఒకేసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల పండుగకు తెరతీసింది. ఈ అవార్డుల పేరిట లైఫ్ అఛీవ్‌మెంట్ పేరుతో చలనచిత్రసీమలో లెజెండ్స్ అయిన రఘుపతి వెంకయ్యనాయుడు, బి.ఎన్.రెడ్డి, ఎన్టీఆర్, నాగిరెడ్డి-చక్రపాణిల పేరిట ఇచ్చే అవార్డులను కూడా ప్రకటించడం ముదావహం. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసిన జ్యూరీ కమిటీ అవార్డు విజేతలను ప్రకటించారు. కమిటీ ప్రతినిధులు నందమూరి బాలకృష్ణ, మురళీమోహన్, గిరిబాబు తదితరులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసి అవార్డులు ప్రకటించారు. 2014కుగాను రఘుపతి వెంకయ్య అవార్డును నటుడు కృష్ణంరాజుకు ప్రకటించారు. 2015కుగాను పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్‌కు, 2016కు గాను నటుడు చిరంజీవికి ప్రకటించారు. అలాగే బి.ఎన్.రెడ్డి జాతీయ అవార్డును 2014కుగాను రాజవౌళికి, 2015కు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, 2016కు దర్శకుడు బోయపాటి శ్రీనుకు అందజేస్తారు. నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు 2014కుగాను ఆర్.నారాయణమూర్తి, 2015 సంగీత దర్శకుడు కీరవాణి, 2016కు నిర్మాత కె.ఎస్.రామారావుకు ప్రకటించారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డును 2014కుగాను కమల్‌హాసన్‌కు, 2015కు కె.రాఘవేంద్రరావు, 2016కు రజనీకాంత్‌కు ప్రకటించారు.
అలాగే 2014కు ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రం ఎంపికైంది. రెండవ ఉత్తమ చిత్రంగా అక్కినేని కుటుంబం నుండి వచ్చిన ‘మనం’ ఎంపిక కాగా, ఉత్తమ తృతీయ చిత్రంగా జగపతిబాబు నటించిన ‘హితుడు’ చిత్రం ఎంపికైంది. ఉత్తమ నటుడిగా బాలకృష్ణ (లెజెండ్), ఉత్తమ నటిగా అంజిలి (గీతాంజలి), ఉత్తమ దర్శకుడిగా బోయపాటి శ్రీను (లెజెండ్), ఉత్తమ కమెడియన్‌గా బ్రహ్మానందం (రేసుగుర్రం), ఉత్తమ విలన్‌గా జగపతిబాబు (లెజెండ్), ఉత్తమ సహాయ నటుడు నాగచైతన్య (మనం) ఎంపికయ్యారు.
2015 సంవత్సరానికిగాను ఉత్తమ చిత్రం బాహుబలి (బిగినింగ్) ఎంపిక కాగా, ఉత్తమ ద్వితీయ చిత్రంగా నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ఉత్తమ తృతీయ చిత్రంగా ‘నేను శైలజ’ చిత్రాలు ఎంపికయ్యాయి. ఉత్తమ బెస్ట్ పాపులర్ చిత్రంగా మహేష్‌బాబు నటించిన శ్రీమంతుడు ఎంపికైంది. ఈ సంవత్సరానికిగాను ఉత్తమ నటుడిగా మహేష్‌బాబు (శ్రీమంతుడు), ఉత్తమ నటిగా అనుష్క (సైజ్ జీరో), ఉత్తమ విలన్‌గా రానా (బాహుబలి), ఉత్తమ కమెడియన్‌గా వెనె్నల కిశోర్ (్భలే భలే మగాడివోయ్, ఉత్తమ సహాయ నటుడిగా పోసాని కృష్ణమురళి, ఉత్తమ సహాయ నటిగా రమ్యకృష్ణ (బాహుబలి), ఉత్తమ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ‘కంచె’, కుటుంబ కథా చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’, ఉత్తమ బాలల చిత్రం ‘దానవీర శూరకర్ణ’, ఉత్తమ దర్శకుడు రాజవౌళి (బాహుబలి), మాటల రచయిత సాయిమాధవ్ (మళ్లీ మళ్లీ ఇది రానిరోజు), సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (బాహుబలి) ఎంపికయ్యారు. 2016కుగాను ఉత్తమ చిత్రంగా ‘పెళ్లిచూపులు’ ఎంపిక కాగా, ఉత్తమ ద్వితీయ చిత్రంగా ‘అర్ధనారీ’, తృతీయ చిత్రంగా ‘మనలో ఒకడు’ ఎంపికయ్యాయి. స్పెషల్ జ్యూరీ అవార్డు సుద్దాల అశోక్ తేజ ఎంపికయ్యారు. ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ (జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో) ఎంపికయ్యారు.

అంజలి (గీతాంజలి)
(ఉత్తమనటి -2014)
అనుష్క (సైజ్‌జీరో)
(ఉత్తమనటి -2015)
రీతూవర్మ (పెళ్లిచూపులు)
(ఉత్తమనటి -2016)

అనుష్క (సైజ్‌జీరో)
(ఉత్తమనటి -2015)
రీతూవర్మ (పెళ్లిచూపులు)
(ఉత్తమనటి -2016)

లెజెండ్ (ఉత్తమ చిత్రం -2014)

బాహుబలి (ఉత్తమ చిత్రం -2015)

పెళ్లి చూపులు (ఉత్తమ చిత్రం -2016)