చిన్న చిత్రాలకు డిజిటల్ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేకమంది దర్శక నిర్మాతలు డిజిటల్ రేట్లు చిన్న సినిమాలకు కూడా పెద్ద చిత్రాల స్థాయిలోనే వసూలు చేస్తూండడంతో నష్టాలపాలు అవుతున్నారు. క్యూబ్ తదితర మాధ్యమాల ధరలు తగ్గించాలి అని ‘షాలిని’ దర్శకుడు షెరాజ్ కోరారు. స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమోగ్ దేశ్‌పతి, అర్చన, శ్రేయావ్యాస్ ప్రధాన తారాగణంగా షెరాజ్ దర్శకత్వంలో పి.వి.సత్యనారాయణ రూపొందించిన హారర్ థ్రిల్లర్ ‘షాలిని’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 75 రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో సినిమా యూనిట్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలిం చాంబర్ చైర్మన్ ఆర్.కె.గౌడ్, సెక్రటరీ సాయి వెంకట్, సినీ నటి కవిత సంయుక్తంగా 75 రోజుల లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు షెరాజ్ మాట్లాడుతూ- సినిమా అంటే ఉన్న పిచ్చి పాషన్‌తో తాను సినీ రంగానికి వచ్చానని అన్నారు.
, కంటెంట్, స్టోరీ, పాటలు, స్క్రీన్‌ప్లే ఏ చిత్రానికైనా బాగా కుదిరినప్పుడే సినిమా చక్కగా వస్తుందని, సినిమా మొదలుపెట్టినప్పటినుండి విడుదలయ్యాక ఎన్నిరోజులు థియేటర్‌లలో ప్రదర్శింపబడితే అన్ని రోజులు నిర్మాతతో అనుసంధానంగా కొనసాగాలని, అప్పుడే ఆ చిత్రం ప్రమోషన్‌లో ముందు స్థాయిలో వుంటుందని ఆయన తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయి వెంకట్ మాట్లాడుతూ- చిన్న సినిమా అయినా 75 రోజులపాటు ఈ సినిమా ప్రదర్శింపబడడం ఆనందదాయకమని, సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో అనేది దర్శకుడు ఓ ప్రయోగంలా చేశారని అన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ- షాలిని చిత్రం 75 రోజులు పూర్తిచేసుకోవడం ప్రేక్షకుల ఆదరణను తెలుపుతోందని, ప్రమోషన్ విషయంలో దర్శకుడు ప్రత్యేకమైన పంథా అవలంభించడంతో ఇంత విజయం సాధించారని, వందశాతం ఈ విషయంలో ఆయనకే క్రెడిట్ వెళుతుందని తెలిపారు. సబ్జెక్ట్‌ను నమ్మి సినిమా చేశారు కనుక థియేటర్‌లను సెలెక్ట్ చేసుకుని ఆడిస్తున్నారని, 100 రోజులు ఆడాలని ఆయన కోరుకున్నారు. మంచి చిత్రాలు కూడా ఫెయిల్ అవుతున్న ఈరోజుల్లో చిన్న సినిమా అయిన షాలిని ఇంత విజయం సాధించడం ఆనందంగా వుందని, 100 రోజులు పండుగ జరుపుకోవాలని తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కవిత తెలిపారు. దర్శకుడే అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించి నడిపించారని నిర్మాత పి.వి.సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు నవనీతచారి, లక్కీ, కథా రచయిత రాజ్ నజీర్, బాలాసతీష్, జ్యో యో, సురేంద్ర, షాయద్, భాషాశ్రీ, ప్రియ, ఆమోగ్‌దేశపతి తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.