24న హేయ్.. పిల్లగాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుల్కర్ సల్మాన్, సాయిపల్లవి జంటగా మలయాళంలో సూపర్‌హిట్ అయిన చిత్రం ‘కలి’. ఈ చిత్రాన్ని తెలుగులో లక్ష్మీ చెన్నకేశవ ఫిలింస్ పతాకంపై డి.వి.కృష్ణస్వామి అందిస్తున్నారు. సమీర్ తాహిర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగులో ‘హేయ్..పిల్లగాడ’ అనే పేరును నిర్ణయించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- మలయాళం, తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నామని, దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులేనని తెలిపారు. టిపికల్ లవ్‌స్టోరీగా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడని, హీరో హీరోయిన్‌లమధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చుతుందని, యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే ఎలిమెంట్స్ అనేకం వున్నాయని తెలిపారు. గోపీసుందర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా పనితనం హైలెట్‌గా వుంటాయన్నారు. ఈ చిత్రానికి మాటలు: బాషాశ్రీ, పాటలు: సురేంద్ర కృష్ణ, కెమెరా: గిరీష్ గంగాధరన్, నిర్మాత: డి.వి.కృష్ణస్వామి, దర్శకత్వం: సమీర్ తాహిర్.