నేనే మైఖేల్ ఆడియో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్టర్ రోహిత్ చంద్రా, నితిన్ చంద్రా, బేబి ప్రణీత, బేబి శ్రీయా ముఖ్యపాత్రల్లో కలసాధన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేనే మైఖేల్’ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ బి.ఎస్.రాములు ఆడియో సీడీని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ- 550 మంది పిల్లలతో ఈ సినిమాను రూపొందించడం గొప్ప విషయమని, మంచి విజయాన్ని అందుకోవాలని తెలిపారు. పిల్లలపై సినిమా తీయాలన్న దర్శకుడు ఆలోచనను మెచ్చుకోవాలని, జీవితంలో గొప్ప లక్ష్యాలను నిర్ణయించుకొని సాధించే దిశగా వారు ప్రయత్నించాలన్న సందేశాన్ని ఈ చిత్రంలో ఇచ్చారని రామచంద్రరావు అన్నారు. చిన్నప్పటినుండి డాన్స్ ప్రాణంగా భావించే ఓ కుర్రవాడు మైఖేల్ జాక్సన్‌గా ఎలా మారాడు అన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోందని దర్శకుడు కృష్ణ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సినిమా యూనిట్ విశేషాలు తెలిపారు.