17న గృహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధార్థ్, ఆండ్రియా జంటగా సిద్ధార్థ్ వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మిలింద్‌రావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గృహం’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రిమియర్ షోను బుధవారం హైదరాబాద్‌లో ప్రదర్శించారు. ఈసందర్భంగా హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ- హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనుకున్నా వీలుకావడంలేదని, ఈనెల 17న తెలుగులో విడుదల చేస్తున్నామని తెలిపారు. హారర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా కథ కోసం చాలా పరిశోధనలు చేశామని, దేవుడు దెయ్యం అనే అంశాలు ఉన్నాయా లేదా అనేది వ్యక్తిగత విషయాలని, తమ పరిశోధనలో 60 శాతం నిజమైన సంఘటనలతోనే ఆధారం చేసుకుని రూపొందించామని తెలిపారు. డ్రమటిక్ అంశాలను జోడించిన ఈ సినిమాకు టెక్నికల్ హైలెట్స్ అద్భుతంగా కుదిరాయని, పూర్తి స్థాయి హారర్ జోనర్‌లోనే రూపొందించామని అన్నారు. ఓ బ్రాండ్ నుండి బయటపడడానికి తనకు తానుగా ఈ సినిమా తీసే నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు. సమాజంలో చాలా ప్రమాదకరమైన మనుషులను చూపించాలనే ఉద్దేశ్యంతోనే అందుకు తగినట్టుగా కథను తయారుచేసుకున్నామని దర్శకుడు మిలింద్‌రావు అన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు గీరీశ్ వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు.