ప్రేమ ఉందా లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ పతాకంపై అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో అయితం ఎస్ కమల్ రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఉందా లేదా’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సార్‌కు సిద్ధమైన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో విడుదలచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట శివ ప్రసాద్ మాట్లాడుతూ- ఔట్‌పుట్ చూశాక సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నామని, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని తెలిపారు. కొత్తవాళ్లైనా అందరూ మంచి కథ అవడంతో బాగా నటించారని ఆయన అన్నారు. సౌండ్ పొల్యూషన్‌వల్ల ప్రజలకు జరిగే అనర్థాలను ఈ చిత్రంలో చక్కగా చర్చించామని, ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నిర్మాత తెలిపారు. కార్యక్రమంలో అంకిత, సినిమా యూనిట్ పాల్గొని విశేషాలు తెలిపారు. కుమార్, సాయి, జీవా, రాంజగన్, ఝాన్సీ, ప్రభావతి తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు:నాగారాజు కువారపు, శేషు మోహన్, సంగీతం:శ్రీమురళి కార్తికేయ, కెమెరా:ప్రవీణ కె.బాంగారి, నిర్మాత:అయితం ఎస్.కమల్, దర్శకత్వం:అమనిగంటి వెంకట శివప్రసాద్.