రుద్రమదేవికి నంది ఇవ్వాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంది అవార్డుల ప్రహసనం అవార్డు కమిటీకి పీడకలనే మిగిల్చిందని చెప్పాలి. ప్రతిష్ఠాత్మక అవార్డుల్లోకి రాజకీయాలు ప్రవేశించడం స్పష్టంగా మరోసారి నిరూపించినట్టయింది. బోల్డ్‌డైలాగులు, బ్యాడ్ ఫైటింగ్‌ల సినిమాలకు ఉత్తమ సినిమాలుగా అవార్డులిచ్చేయడం కమిటీ ఉదారతను చాటి చెప్పింది. దీంతో ఒక్కొక్కరుగా నందులపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే బండ్ల గణేష్, బన్ని వాసు, గుణశేఖర్ వంటివాళ్లు నందుల వ్యవహారంపై రుసరుసలాడుతున్నారు. టీవీ ఛానెళ్లకెక్కి నంది కమిటీని ఏకేస్తున్నారు. ఇక ఈ వరుసలోకి వచ్చి చేరారు నారాయణమూర్తి. ‘రుద్రమదేవి’ సినిమాకు నంది అవార్డు రావాల్సిందని గుణశేఖర్‌ని సమర్థిస్తూ పీపుల్స్ స్టార్ సపోర్టుగా నిలిచారు. సిపాయిల తిరుగుబాటులో భారతదేశానికి ఝాన్సీలక్ష్మీబాయి ఎలానో.. మన తెలుగు జాతికి రుద్రమదేవి అలా అని తెలిపారు నారాయణమూర్తి. గతంలో పురస్కారాలకు గౌరవం ఉండేది. విలువలకు పట్టంగట్టి అవార్డులిచ్చేవారు. కమర్షియల్ సినిమాలకు అవార్డులిస్తూ నంది ఖ్యాతిని దిగజార్చారని అన్నారు. బాహుబలి సాంకేతికంగా, వినోదపరంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మాట వాస్తవమే అయినా.. జాతీయ ఉత్తమ అవార్డు ఇచ్చినపుడే అవార్డులపై నమ్మకం పోయిందని రివర్స్ గేర్ వేశారు నారాయణమూర్తి. అంతర్జాతీయ సినిమా తీసిన అత్యుత్తమ దర్శకుడు రాజవౌళికి సెల్యూట్ అంటూనే అవార్డుల వ్యవహారాన్ని తూర్పారబట్టారు.