సెంటిమెంట్‌ను గౌరవించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్ బర్దారుూ అనే జానపద గాయకుడు పృథ్విరాజ్ రాసో అనే గీతం రచించాడు. దీనిని ఆధారంగా చేసుకొని పృథ్విరాజు-రాణి సంయుక్తల కథా నిర్మాణం జరిగింది. జానపద గాథలు- జనశ్రుతులు- కైఫీయతులు- నాణెములు - శాసనములు నికోల కోంటి పాఫియాన్ ప్లూటార్క్, హ్యుయన్‌సాంగ్ అబ్దుల్ రజాక్ వంటి విదేశీయుల వ్రాతలు ఇలా చరిత్ర నిర్మాణానికి కొన్ని అంశాలు సహాయపడతాయి. రాణి పద్మిని చరిత్ర నిర్మాణానికి ఈశ్వరీప్రసాద్ వంటివారు రామచంద్ర శుక్ల, జేమ్స్‌టాడ్ వంటి వారి రచనలు ఆధారం చేసుకోవచ్చు. అల్లావుద్దీన్-మాలిక్ కాఫర్‌ల జీవిత చరిత్రలను బాగా అధ్యయనం చేసి ‘మాలిక్ కాఫర్’ అనే పేరుతో 2015లో ఒక చారిత్రక నవల వ్రాశాను. మేవాడ్ రతన్‌సింగ్ భార్య రాణి పద్మిని. ఈమెను అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ఢిల్లీ పాలకుడు తన జనానాలో చేర్చుకోవాలని ప్రయత్నించాడు. రాణి పద్మిని అంతఃపురానికి నిప్పు అంటించుకుని ఆత్మాహుతి చేసుకుంది. దీనిని జోహార్ అంటారు. రాజస్థాన్ చరిత్రలో ఇలా మూడుసార్లు జోహార్లు జరిగాయి. ఎందుకంటే విదేశీ దురాక్రమణలు ముందుగా పంజాబ్ రాజస్థాన్‌ల మీదనే జరిగాయి.
మాలిక్ కాఫర్ దక్షిణాపథానికి వచ్చి శ్రీరంగం, హళిబేడు వంటి ప్రాంతాలను దోచుకున్నాడు. శ్రీరంగంలోని విష్ణుమూర్తి విగ్రహాన్ని తిరుపతికి తరలించారు. అదే నేటి గోవిందరాజస్వామి మూర్తి. మాలిక్ కాఫర్ వరంగల్‌ను దోచుకున్నాడు. 241 టన్నుల బంగారం, కోహినూరు వజ్రం తీసుకొని ఢిల్లీ వెళ్లిపోయాడు. ఈ చరిత్రను ఎందరు అధ్యయనం చేసారు?
సంజయ్‌లీలా బన్సాలీకి చారిత్రక ప్రామాణ్యంపై దృష్టి వుందా? లోగడ బాజీరావు మస్తానీ సినిమా తీసాడు. ఇది ఔరంగజేబు కాలానికి చెందిన ఇతివృత్తం. బుందేల్‌ఖండ్ రాజు రాజా ఛత్తీసాల్ కథ ఇది. ఇప్పుడు పద్మిని పేరును పద్మావతిగా మార్చి సినిమా మొదలుపెట్టాడు. దీనికి దావూద్ ఇబ్రహీం పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు బాలీవుడ్‌కు ఏమైంది? ఆర్థిక నేరస్తులకు సినిమా పరిశ్రమ షెల్ కంపెనీగా మారిందా? సినిమా సెన్సారు సర్ట్ఫికెట్ సి బి ఎస్- టి అందుకోలేదు. అప్పు డే ఇంత గొడవ ఎందుకు అని ప్రశ్న. గుజరాత్‌లో ఎన్నికలు వస్తున్నాయి. అందుకని ఈ ఆందోళన రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్నదని ఒక ఆరోపణ. ప్రతాప్ కర్ని అనే రాజపుత్ర వీరుడు కర్ని సేన అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ సభ్యులు దాదాపురెండు సంవత్సరాలుగా పద్మిని చిత్ర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐనా బన్సాలీ పట్టించుకోలేదు. ఇప్పుడు బన్సాలీలు, రాంగోపాల్ వర్మలు థియేటర్ల వద్ద సైనిక బలగాలను మోహరించి సినిమాలు నడిపించుకోవలసిన స్థితి వచ్చింది. అన్నమంతా పట్టి చూడనక్కరలేదు అనే సామెత వుంది. ఇప్పటికే ట్రయిలర్ విడుదలైంది. అందులో దీపికా పడుకునే ఒక సాధారణ రాజనర్తకి వలె గెంతుతున్నది. పద్మినిని ఎవరు చూసారు? ఆమె గెంతిందో పడుకుందో ఎవరికి తెలుసు అని పడుకునే ప్రశ్న. గౌతమ బుద్ధునికి యశోధరకు ఒక బాల్ రూమ్ డాన్స్ సన్నివేశం సృష్టిస్తే బౌద్ధమతస్తులు ఊరుకుంటారా? ఇవ్వాళ పద్మినికి అల్లావుద్దీన్ ఖిల్జీకి యుగళ గీతం పెట్టి సినిమా తీసినవారు రేపు సీతకు రావణాసురునికి ఓ డ్యూయట్ సాంగ్ పెట్టి సినిమా తీయరు- అనే నమ్మకం ఏమిటి? రాజస్థాన్‌లోని కోట అనే ప్రాంతంలోని ఒక థియేటర్‌లో పద్మిని చిత్రానికి సంబంధించిన ‘ప్రోమో’ ప్రదర్శిస్తుంటే కర్నిసేన వారు అడ్డుకుని అద్దాలు పగులగొట్టారు. వారిని ప్రభుత్వం అరెస్టు చేసింది. చట్టంను తమ చేతిలోకి తీసుకునే అధికారం ఎవరికీ లేదు. కాని ఐతే ప్రొఫెసర్ ఆదిత్య ముఖర్జీ ‘పద్మిని కథ కల్పితం’ అంటున్నది. ఎందుకంటే 1303లో జరిగిన సంఘటనకు చారిత్రక ఆధారాలు 250 సంవత్సరాల తర్వాత కన్పడుతున్నాయని ఆమె ఆరోపణ. ఇది తర్కానికి నిలువదు. ఎందుకంటే రుద్రమదేవి మరణించిన ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత మొన్న చందుపట్ల శాసనం దొరికింది. అందులో ఆమె కైలాసానికి పోయిన తేదీ ఉదహరించబడి వుంది.
చారిత్రక చిత్ర నిర్మాణం జరిగినప్పుడు తప్పనిసరిగా చారిత్రక ప్రామాణ్యం ఉండాలి. లేకుంటే విఠలాచార్యగారి జానపదాలు తీసుకోవచ్చు. ఎవరూ ప్రశ్నించరు.
లల్లాదేవి అనే రచయిత ‘దేవీ నాగానీక’ పేరుతో ఒక నవల వ్రాశాడు. దీనికి చారిత్రక ప్రామాణ్యం ఏమిటి? అని ప్రశ్నించాను. ఇది ఫిక్షన్ అన్నాడు. మనస్తాపం చెందిన నేనే షూట్ శాసనం ఆధారంగా ‘దేవీ నాగానీక’పై ఒక నవల వ్రాశాను. ఎం.ఎస్.రెడ్డి గారు నన్ను శబ్దాలయకు పిలిచి కులీకుతుబ్‌షా కథ వినిపించారు. అందులో బాగామతి తారామతి కరాటే యుద్ధం చేస్తున్న ఘట్టం ఉంది. దీనికి ప్రామాణ్యం ఉందా? అని ప్రశ్నించాను. అక్కరలేదు అని ఆయన జవాబిచ్చారు. అంటే పొయిటిక్ లైసెన్స్ ఆర్టిస్టిక్ లైసెన్సు- డ్రమెటిక్ లైసెన్స్‌ల పేరుతో అభూత కల్పనలు చేయటం భావ్యమా??
రాజస్థానీయులు నేటికీ రాణి పద్మినిని దేవతలాగా ఆరాధిస్తారు. ఆమెను అవమానించే అధికారం బన్సాలీకి కాదు ఆయన బాబుకు కూడా లేదు. మేరీమాతను ఫతీమా మాతను అవమానిస్తూ సినిమాలు తీస్తే ఆ మతస్థులు తిరుగుబాటు చేయరా?? జీసు క్రైస్ట్‌కు కూక్డలీనాకు ప్రేమ సన్నివేశం పెట్టి ఎవడో సినిమా తీస్తే దానిని ఆడనివ్వలేదు. నిజమే. జీసస్ క్రైస్ట్‌ను అవమానించే అధికారం ఎవరికీ లేదు. ఐతే 85 కోట్ల మంది హిందువుల మనోభావాలను ఎవరైనా గాయపరచవచ్చు. ఎందుకంటే ఇదొక సిగ్గులేని జాతి!! దున్నపోతుమీద వర్షం!!జయాస్ శ్రీలక్ష్మీస్ ఎన్‌టిఆర్‌ను ఆడనిస్తే ఈ బాలీవుడ్ సైకోలు మంజూస్ గుండూరావు అనే సినిమాలు తీస్తారు.
నిజంగా సంజయ్ లీలా బన్సాలీ, రాంగోపాల్ వర్మ వంటివారు చాలా అదృష్టవంతులు. పైసా ఖర్చు లేకుండా దేశ విదేశాల్లో వారి చిత్రాలకు ప్రి పబ్లిసిటీ- ఫ్రీ పబ్లిసిటీ లభిస్తున్నది. అందుకు వారు ఇంగ్లీషు టివి చానల్స్‌కు కృతజ్ఞతలు తెలియచేయాలి. డబ్బు తీసుకుని దీపిక పడుకునే ఈ సినిమాలో పద్మావతి వేషం వేసింది. అందులో ఆమె తప్పు ఏమీ లేదు. ‘‘శూర్పనఖ ముక్కు కోసినట్లు నీ ముక్కు కోస్తాను’’ అని నటిని బెదిరించటం చట్టరీత్యా కాని మానవీయ కోణంలో కాని తగదు. కాకుంటే బాలీవుడ్‌కు డబ్బు సంపాదించటం మాత్రమే తెలుసు. వారికి సంస్కృతితో చరిత్రతో ఎట్టి సంబంధమూ లేదు గోరంత గౌరవం కూడా లేదు. చరిత్రను లోతుగా అధ్యయనం చేసినవాణ్ణి కాబట్టి అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఎంతటి భయంకరుడో నాకు తెలుసు. ఆయనను హీరో పెట్టి సినిమా తీయటం ఏమిటి?? పోనీ ఛత్రపతి శివాజీ మీదనో రాణా ప్రతాప్ మీదనో, సర్దార్ వల్లభ్ భాయి పటేల్, ఎ-ది-సావర్కార్ మీద ఒక మహేతిహాసం నిర్మించవచ్చుకదా! అందుకు ఈ అంగుష్టమాత్రులు సిద్ధంగా లేరు. మరో సంగతి- కర్ని సేన- పద్మావతి చిత్రాన్ని విడుదల కానివ్వం అని బెదిరించటం కూడా తగదు. మనకు సరిహద్దులలో భారత సేన ఉంది. మరి ఈ ప్రైవేటు సైన్యాలు కర్నిసేన- శివసేన- జనసేన- కలిసేన (శేషేంద్ర)లు అవసరమా? వీళ్లు ఎలోఒసికి వెళ్లి యుద్ధం చేస్తారా?

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్