మొదటిసారి పాటిజివ్ పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటివరకు నెగెటివ్ పాత్రలు చేసిన నేను మొదటిసారి పాజిటివ్ పాత్ర చేశాను. ఇందులో నరసింహారావు అనే ఎన్‌ఐఎ అధికారిగా నటించానని అంటున్నాడు యువనటుడు చరణ్‌దీప్. రాజశేఖర్ హీరోగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఎస్‌వి గరుడవేగ’ చిత్రం ఇటీవలే విడుదలైమంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మొదటి సారి పాజిటివ్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు నటుడు చరణ్‌తేజ్. ఈ సినిమా ఇచ్చిన కొత్త విజయం చాలా ఆనందంగా ఉందంటున్నాడాయన. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ- విలన్‌గా చాలా సినిమాల్లో నటించిన నేను మొదటిసారి పాజిటివ్ పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉంది. నిజానికి నన్ను పాజిటివ్ పాత్రలో ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా? అన్న అనుమానం ఉండేది. కానీ నరసింహారావు పాత్రలో నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నేను పుట్టింది కడపలో అయినా సెటిలైంది హైద్రాబాద్‌లోనే. బిటెక్ అయిన తరువాత సినిమాల్లోకి వచ్చాను. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేశా. 2014లో బిల్లారంగా, అలాగే హీరోగా అంతం సినిమాలు చేశాను. నాకు నటుడిగా పేరు తెచ్చింది మాత్రం లోఫర్ సినిమా. ఆ తరువాత పలు సినిమాల్లో విలన్ పాత్రలు వేశాను. అటు తమిళం, కన్నడలో కూడా చేశాను. నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. తెలుగులో ముంబై నుండి విలన్‌లను తెచ్చుకోవడం చూసి ఎందుకు మన తెలుగు వాళ్లకు అవకాశాలు రావడంలేదనే ఫీలింగ్‌తో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. సిక్స్ ప్యాక్ కూడా చేశాను. ‘గరుడవేగ’ సినిమా తరువాత మంచిపాత్రలు చేయాలని ఉంది అన్నారు.