భజన పరులకే అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా హీరో శివాజీ కూడా స్పందించాడు. సినీ పరిశ్రమలో కొందరు ప్రభుత్వం దగ్గర భజన చేసి అవార్డులు తీసుకుంటున్నారని అన్నారు. తనకు కూడా గతంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. ఈ అవార్డులు టిడిపికి చెందినవారికే ఇస్తున్నారని, మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమే అని అన్నారు. అవార్డులు ఇవ్వాలంటే ఒక కమిటీవేసి.. దాంతో పాటు ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని అన్నారు. గతంలో తాను నటించిన మిస్సమ్మ సినిమా బాగా ఆడిందని, ఆ సినిమా విషయంలో తనకు అవార్డు ఇచ్చే విషయంలో అన్యాయం జరిగింది అన్నారు. నన్ను ఉత్తమ నటుడు అవార్డునకు ఎంపిక చేస్తే కొందరు కావాలని అడ్డుకున్నారని చెప్పారు. మొత్తానికి నంది అవార్డుల విషయంపై పరిశ్రమలో పెద్ద దుమారమే రేగేలా ఉంది.