ప్రస్తుతం డిజిటల్‌దే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనీష్ చంద్ర, పావని, పూర్ణి ముఖ్యపాత్రల్లో ధృవశేఖర్ దర్శకత్వంలో ప్లాన్ బి ఎంటర్‌టైన్‌మెంట్, శ్రేయా మూవీస్ పతాకంపై భరత్ అవ్వారి నిర్మించిన ‘లవర్స్ క్లబ్’ సినిమా ఈ శుక్రవారం విడుదలయింది. ఇండియన్ స్క్రీన్‌పై మొదటిసారి ఐఫోన్‌పై చిత్రీకరించిన ప్రయోగాత్మక సినిమా ఇది. ఈ సినిమా గురించి దర్శకుడు ధృవశేఖర్ వివరాలు తెలియజేస్తూ- సినిమా ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం, ముఖ్యంగా ఐఫోన్‌తో తీసిన మొదటి ఇండియన్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఎక్కువైంది. ఇండియాలో మొదటిసారి ఐ ఫోన్‌తో తీసిన సినిమా ఇది. ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీదే హవా.. ముందు ముందు మరింత టెక్నాలజీ వస్తుంది. ఇక లవర్స్ క్లబ్ సినిమా ఓ రియల్ సంఘటన బేస్ చేసుకుని తీసింది. టెక్నికల్‌గా సినిమా బాగా వచ్చిందని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఈ సినిమాలో హీరో అనీష్‌చంద్ర, హీరోయిన్‌గా పావని, పూర్ణి వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. సినిమాలో హీరోయిన్‌తో సిగరెట్ ఎందుకు తాగించారని అందరూ అడుగుతున్నారు.
ప్రస్తుతం సొసైటీలో అమ్మాయిలు చాలా పాస్ట్ అయ్యారు. నేను చూసి అమ్మాయిలను బేస్ చేసుకుని హీరోయిన్‌తో సిగరెట్ తాగించాం.. ఈ సినిమా తరువాత చాలామంది మళ్లీ ఐ ఫోన్‌తో సినిమా చేస్తారా? అని అడుగుతున్నారు. ఇప్పుడైతే చేయను.. ఆ సినిమాను ఫోన్‌లో చేయడానికి కారణం.. ఎన్నో సినిమాలు వస్తున్నాయి.. మనం ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఏదో ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ టెక్నాలజీ వాడాం.. ఈ సినిమా తరువాత హిందీలో ఐఫోన్‌తో మరో సినిమా చేస్తున్నా అంటూ ముగించారు.