‘పద్మావతి’ విడుదల వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటికప్పుడు కొత్త వార్తలతో మీడియాలో మారుమోగుతున్న ‘పద్మావతి’ చిత్రం విడుదల వాయిదా పడింది. దీపికా పదుకొనే ముఖ్యపాత్రలో సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రంపై అనేక వివాదాలు ముసురుకున్నాయి. టైటిల్ పోరులో దీపిక నటించగా, చిత్తోడ్‌గఢ్ రాజు రతన్‌సింగ్‌గా షాహిద్‌కపూర్, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్‌సింగ్ నటిస్తున్నారు. షూటింగ్ సమయంలోనే అనేక వివాదాల్లో ఇరుక్కున్న ఈ సినిమాను డిసెంబర్ 1నే విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. అయితే తాజాగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చట్టం, కేంద్ర సెన్సార్‌బోర్డు వారి మాటను గౌరవించి ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నామని, అనుమతి త్వరలో లభిస్తుందన్న నమ్మకం వుందని యూనిట్ తెలిపింది. తమ దరఖాస్తు అసంపూర్తిగా వుందని బోర్డు వెనక్కి పంపిందని, త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా చిత్రాన్ని రూపొందించామని, సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని పలు వర్గాల ప్రజలు డిమాండ్ చేసారని పేర్కొన్నారు.