ప్రేమ వాన విల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్, శ్రావ్య, విశాఖ ప్రధాన తారాగణంలో లంక కరుణాకర్‌దాస్ నిర్మాతగా, ప్రతీక్ ప్రేమ్‌కరణ్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘వాన విల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల సందర్భంగా కృష్ణారెడ్డి సీడీని విడుదల చేసారు. సంగీతం దర్శకుడు కోటి తొలి సీడీ అందుకున్నారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ప్రతీక్ ప్రేమ్‌కరణ్ మాట్లాడుతూ, రెండున్నరేళ్లుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ప్రొడక్షన్, దర్శకత్వం, హీరోగా అన్ని విభాగాలను చూసుకోవడం ఓ వైవిధ్య అనుభవాన్నిచ్చిందని, చిన్నప్పటి నుంచి దర్శకుడు కావాలనే కల ఈ చిత్రంతో నిజమైందని తెలిపారు. నా వంతుగా ఈ చిత్రాన్ని వైవిధ్యంగా తెరకెక్కించడానికి ప్రయత్నించానని, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు స్టార్‌గా భావిస్తున్నానని అన్నారు. సంగీత దర్శకుడు అందరికీ నచ్చే బాణీలతో పాటలందించారని, ఈ సినిమాలో స్టూడెంట్సే ఎక్కువగా పనిచేసారని, ఆ కష్టం తెరపై కనపడుతుందని తెలిపారు. సినిమా రంగానికి దూరంగా వున్న నన్ను హీరో ఇటువైపు తీసుకువచ్చారని అతని సహకారంతోనే ఈ చిత్రంలో పాటలను అందించానని సంగీత దర్శకుడు ప్రభు ప్రవీణ్ తెలిపారు. కార్యక్రమంలో లంక కరుణాకర్‌గా గూడూరు నారాయణరెడ్డి, బి.ప్రకాష్, విల్సన్, డొక్క మాణిక్య వరప్రసాద్, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. హేమ, ప్రభాస్ సీను, సత్య, సురేఖవాణి, వేణు, ఫణి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు-పవన్, కెమెరా-ఎస్.డి.జాన్, నిర్మాత-లంక కరుణాకర్, స్క్రీన్‌ప్లే-ఎడిటింగ్- దర్శకత్వం- ప్రతీక్ ప్రేమ్‌కరణ్.