ఛలో టీజర్ వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, రశ్మిక జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై వెంకి కుడుముల దర్శకత్వంలో ఉషా మూల్పూరి, శంకర్‌ప్రసాద్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం ‘ఛలో’. ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రదర్శించారు. టీజర్‌ను ఆవిష్కరించిన త్రివిక్రమ్ మాట్లాడుతూ, తన దగ్గర పనిచేసిన దర్శకులు ఈ చిత్రాన్ని వైవిధ్యంగా రూపొందించారని, తప్పక విజయవంతమవుతుందన్న ఆకాంక్షను వ్యక్తం చేసారు. ఐరా క్రియేషన్స్ లోగోను సాయి కొర్రపాటి విడుదల చేసారు. ఈ సందర్భంగా నిర్మాత ఉష మాట్లాడుతూ, పోస్టర్లకి మంచి రెస్పాన్స్ వచ్చిందని, సినిమా బాగుందని నాగశౌర్య నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారని అన్నారు. హీరో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం వుందని, సినిమా ప్రమోషన్‌ను కొత్తగా చేయనున్నామని, డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కన్నడంలో సూపర్ హిట్ అయిన కిరాక్‌పార్టీ కథానాయిక రశ్మిక ఈ చిత్రాలో హీరోయిన్‌గా నటించిందని, ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లో జరిగే కాలేజీ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించామని పేరుకు తగ్గట్టుగా కథ కూడా వైవిధ్యంగా వుండి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. త్రివిక్రమ్ తమ కార్యక్రమానికి వచ్చి ప్రారంభించడం ఆనందంగా వుందని నాగశౌర్య అన్నారు. కార్యక్రమంలో శంకర్‌ప్రసాద్, బుజ్జి, గౌతమ్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. చిత్రానికి సంగీతం-సాగర్ మహతి, కెమెరా-సాయిశ్రీరామ్, సమర్పణ-శంకర్‌ప్రసాద్ మూల్పూరి, నిర్మాత-ఉష మూల్పూరి, దర్శకత్వం- వెంకి కుడుముల.