బోయపాటితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్‌తేజ్ తాజాగా నటిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రం పూర్తికాగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్నాడు. మంచి మాస్ ఫాలోయింగ్ వున్న ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. మాస్ ఎంటర్‌టైనర్ స్పెషలిస్ట్‌గా బోయపాటి శ్రీనుకు వున్న ఇమేజ్‌తోపాటుగా రామ్‌చరణ్ కలయికలో రూపొందే ఈ సినిమాపై భారీగా అభిమానులు లెక్కలు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఈనెలలోనే ప్రారంభం కానుందట! అయితే ఈ వార్తపై హీరో నుండి కానీ దర్శకుడి నుండి కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో చరణ్ పాత్రను సరికొత్తగా డిజైన్ చేయనున్నారని సమాచారం. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.