పాటేసుకుంటున్న పవన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఇది అదిరిపోయే న్యూస్. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో కాటమరాయుడా అంటూ పాడిన పవన్‌కళ్యాణ్ మరోమారు ఫ్యాన్స్‌ను అలరించబోతున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ‘కొడకా.. కోటేశ్వరా’ అంటూ పవన్ కళ్యాణ్ తన గొంతు వినిపించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈవార్త ఫిలింనగర్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. జానపద గేయాలని తన చిత్రాల్లో పవన్‌కళ్యాణ్ ఎక్కువగా పెడుతుంటారు. ఈ చిత్రంలో కూడా అదే జరగబోతోందని అంటున్నారు. చివరగా పవన్‌కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా’ అంటూ పాడిన పాట పెద్ద హిట్ అయింది. ఆ చిత్రం కూడా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. దీనితో త్రివిక్రమ్ అదే సెంటిమెంట్‌ని పాలో అవుతన్నాడట. సంగీత దర్శకుడు అనిరుధ్ మాస్ జనాల్ని ఆకర్షించేలా ట్యూన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటనరాని ఈ వార్త గురించే పవన్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్, టైటిల్ సాంగ్ కోసం వారణాసిలో జరిగి షెడ్యూల్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో ఆడియో వేడుకకు సన్నాహాలు చేస్తున్నారు.